MI vs RCB మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఈ మ్యాచ్లో ఆ జట్టుదే పైచేయి!

MI vs RCB మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఈ మ్యాచ్లో ఆ జట్టుదే పైచేయి!

MI vs RCB: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ముంబై జట్టు తమ సొంత మైదానంలో ఆడటం వల్ల వారు కొంత పైచేయి సాధించే అవకాశం ఉంది. ఎంఐ జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లాంటి ఆటగాళ్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు. మరోవైపు బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ ప్రధానంగా నిలుస్తాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య మధ్య పోరు ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. 


ఈరోజు విజేత ఎవరంటే?: 
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంటుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, గత రికార్డుల (వాంఖడేలో చివరి 7 మ్యాచ్‌ల్లో ముంబై 6 గెలిచింది) దృష్ట్యా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, వాంఖడేలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 22 మ్యాచ్‌ల్లో 55 సగటుతో 838 పరుగులు సాధించాడు. 

►ALSO READ | గుడ్ న్యూస్: ఉప్పల్ స్టేడియం ముందు క్యూ లైన్లకు ఫుల్ స్టాప్.. ఇక నుంచి డిజిటల్ టికెట్ల ద్వారా అనుమతి


ప్లేయింగ్ XI: 
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్.