గుడ్ న్యూస్: ఉప్పల్ స్టేడియం ముందు క్యూ లైన్లకు ఫుల్ స్టాప్.. ఇక నుంచి డిజిటల్ టికెట్ల ద్వారా అనుమతి

గుడ్ న్యూస్: ఉప్పల్ స్టేడియం ముందు క్యూ లైన్లకు ఫుల్ స్టాప్.. ఇక నుంచి డిజిటల్ టికెట్ల ద్వారా అనుమతి

పోలీసు శాఖ, క్రికెట్ అసోసియేషన్ కలిసి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఉప్పల్ స్టేడియం ముందు ఇక నుంచి లైన్లలో నిలుచునే అవసరం లేకుండా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 2026 ఏప్రిల్ 13 (సోమవారం) నుంచి  జరగబోయే మ్యాచ్ లకు ఇక నుంచి డిజిటల్ టికెట్ల ద్వారానే అనుమతించనున్నట్లు తెలిపారు. డిజిటల్ టికెట్ల విధానానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

డిజిటల్ టికెట్ల విషయంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో  జరుగనున్న మ్యాచ్ లన్నీ డిజిటల్ టికెట్లు ద్వారానే అనుమతించాలని నిర్ణయించారు. గతంలో  సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్‌ల సమయంలో ప్రేక్షకుల రద్దీ, తోపులాటలు, టికెట్ వెరిఫికేషన్ ఆలస్యం వంటి సమస్యలు ఎదురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా స్టేడియం గేట్ల వద్ద టికెట్ చెకింగ్ సమయంలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిజికల్ టికెట్ల కారణంగా  ప్రేక్షకులు ఎక్కువ సేపు క్యూ లైన్లలో వెయిట్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పోలీసు శాఖ, క్రికెట్ అసోసియేషన్ కలిసి డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న గుజరాత్.. మొదట బ్యాటింగ్ చేయనున్న లక్నో

కొత్తగా అమలు చేయనున్న ఈ విధానంలో ప్రేక్షకులు మొబైల్ ఫోన్‌లోనే టికెట్‌ను చూపించి స్టేడియంలోకి ప్రవేశించవచ్చు. లైవ్ QR కోడ్ స్కానింగ్ ద్వారా ప్రవేశాన్ని వేగవంతం చేయనున్నారు. దీనివల్ల గేట్ల వద్ద క్యూలు తగ్గడమే కాకుండా, సెక్యూరిటీ చెకింగ్ కూడా సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ టికెట్ల బుక్ చేస్తే 5 గంటలు ముందుగానే తమ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి లేని యడల ఆ టికెట్ స్కాన్ అవ్వదని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.