లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్ రావడంతో శనివారం (2026) ఏప్రిల్ 11) ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ యూనిట్ లో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రీచ్ కాండీ హాస్పిటల్ డా.ప్రతీత్ సమ్దానీ చెప్పిన వివరాల ప్రకారం.. గుండెపోటుతో ఆశా భోస్లేను ఆస్పత్రికి తీసుకొచ్చారు. వెంటనే ఎమర్జెనీ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఆమె హెల్త్ కండిషన్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం అని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.
- తెలుగులో భోస్లే హిట్స్:
తెలుగులో మరుపురాని హిట్ సాంగ్స్ పాడారు భోస్లే. ఈ జనరేషన్ కు 2007లో చందమామ సినిమాలో పాడిన నాలో ఊహలకు నాలో ఆశలకు నడకలు నేర్పావు.. అనే పాట ద్వారా ఆమె గుర్తుంటారు. హిందీతో పాటు తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఎన్నో డుయెట్స్ పాడారు. ముఖ్యంగా తెలుగులో ఇది మౌన గీతం (పాలు నీళ్లు 1981), శీతాకాలం ప్రేమకు (అశ్వమేధం 1992), ఓ ప్రేమ (అశ్వమేధం,1992), ఐసలకడీ (పవిత్ర బంధం 1996), వెన్నెల (ఇద్దరు 1997).. మొదలైన పాటలు ఆమెను తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిపిఉంచుతాయి.
- చురా లియా హై తుమ్నే జో దిల్ కో..
ఆశా భోస్లేకు మల్టీటాలెంటెడ్ సింగర్ గా పేరుంది. గజల్స్ నుంచి ఉర్రూతలూగించే క్యాబరే గీతాల వరకు ఎలాంటి పాటనైనా సునాయాసంగా పాడటం ఆమె స్పెషల్. హిందీలో ఓ.పి. నయ్యర్‌తో ఆమె ఆవో హుజూర్ తుమ్కో సాంగ్ ఎంత హిట్టో మన తాతలు, తండ్రులకు తెలుసు. ఆర్.డి. బర్మన్‌తో ఆమె పాడిన ఎవర్ గ్రీన్ హిట్.. చురా లియా హై తుమ్నే జో దిల్ కో.. ఈ జనరేషన్ కు కూడా సుపరిచితం అని చెప్పుకోవచ్చు.
Also Read : వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
పియా తు అబ్ తో ఆజా, యే మేరా దిల్.. వంటి పాటలలో శృంగారాన్ని నింపగల ఆమె సామర్థ్యం హిందీ సినిమా సంగీత స్వరూపంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. యే మేరా దిల్.. అనే సాంగ్ రీమేక్ లో కూడా ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్‌కు అతీతంగా, ఆమె ఇన్ ఆంఖోం కీ మస్తీ, దిల్ చీజ్ క్యా హై ఎమోషనల్ సాంగ్స్ ఎంతో మందిని ఆకట్టుకకుకన్నాయి. శాస్త్రీయ సంగీతం నుంచి క్యాబరే వరకు ఆమె పాడిందంటే.. అందులో తన మార్క్ ఉండాల్సిందే.
- మోడ్రన్స్ హిట్స్..
బ్లాక్ అండ్ వైట్ తెర నుంచి ఇప్పటి వరకు ఆమె పాటకు జనం నీరాజనం పలికారనే చెప్పాలి. పాత పాటలే కాకుండా 90వ , 2000వ దశకం ప్రారంభంలో, భోస్లే ఆధునిక, పాప్-ప్రభావిత సంగీతాన్ని స్వీకరించి, తన కెరీర్ ను రీస్టార్ట్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్‌తో ఆమె చేసిన.. తన్హా తన్హా, రంగీలా రే.. వంటి ఐకానిక్ పాటలతో మంత్రముగ్ధులను చేశారు. రాత్ అకేలీ హై రీమిక్స్, జరా సా జూమ్ లూ మై.. తన మార్క్ చూపించారు. జనత్-ఎ-జహాన్, కభీ తో నజర్ మిలావో వంటి ఇండిపాప్ హిట్‌లతో ఆమె తన లెజెండరీ హోదాను కొనసాగిస్తూ వచ్చారు.
- అవార్డ్స్:
సంగీత రంగానికి ఆమె చేసిన అపారమైన కృషికి గాను, భోస్లే భారత అత్యున్నత పౌర, సినీ పురస్కారాలు అందుకున్నారు. 2000లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 2008లో పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. అంతేకాకుండా, ఉమ్రావ్ జాన్, ఇజాజత్.. చిత్రాలలో తన అద్భుతమైన నటనకు గాను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు.
