పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సింగర్ మంగ్లీ..!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సింగర్ మంగ్లీ..!

తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సింగర్ మంగ్లీ హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2026 ఏప్రిల్ 12వ తేదీన పంజాగుట్ట స్టేషన్ కు వచ్చిన మంగ్లీ.. సింగపోగు సుబ్బు అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తనపై సింగపోగు సుబ్బు దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మంగ్లీ. సుబ్బు తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని పోలీసులకు తెలిపారు. డబ్బు ఇవ్వనందుకు దుర్భాషలాడుతూ మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించాడని కంప్లైంట్ లో పేర్కొన్నారు.  ఇప్పటికే మంగ్లీపై పంజాగుట్ట పీఎస్ లో మైక్రో ఫైనాన్స్ పేరుతో 10 కోట్ల రూపాయల మోసం చేసిందని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

►ALSO READ | కేసు టేకప్ చేయాలా.. డబ్బు, మందు బాటిళ్లు పంపించు.. మీర్పేట్ ఎస్సై నిర్వాకం

యాంకర్ శ్రీముఖీ తన క్రష్ :

పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడారు మంగ్లీ.  అడ్వకేట్ సుబ్బారావుకు యాంకర్ శ్రీముఖిపై క్రష్ అని ఈ సందర్భంగా మంగ్లీ చెప్పారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేసి ఫేమస్ కావాలని చూస్తున్నాడని అన్నారు. ఈ సందర్భంగా మంగ్లీ కామెంట్స్..

  • అడ్వకేట్ సుబ్బారావు నన్ను టార్గెట్ చేసి నా పై అసత్య ప్రచారం చేస్తున్నారు..
  • బిగ్ బస్ వెళ్లేందుకు అసత్య ప్రచారం చేసి ఫేమస్ కావాలని చూస్తున్నాడు..
  • ఈ వ్యవహారంలో నా పాత్ర ఉంది అంటే నేను దేనికైనా సిద్ధం..
  • ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు..
  • నాకు చేతి నిండా పని ఉంది.ప్రజలను మోసం చేసే పనులు ఎందుకు  చేస్తాను..?
  • బాధితుల తరఫున నేను పోరాడతాను..
  • నన్ను బద్నాం చేస్తున్నారు..
  • నా మూలాలను నేను మర్చిపోను.. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను..
  • నాకు డబ్బు ఆశ లేదు.. పాటలే నా ప్రపంచం..
  • నా తమ్ముడిపై కూడా నింద మోపుతునారు..
  • నా తమ్ముడు డబ్బుల కట్టలతో ఉన్న వ్యక్తి కాదు..
  • ఈ వ్యవహారంలో నేను అన్ని విధాలుగా పోరాటం చేస్తాను..