బెంగళూరు, ఢిల్లీ చాలా చీప్‌ గురూ…

బెంగళూరు, ఢిల్లీ చాలా చీప్‌ గురూ…
  • బ్రిటన్ సంస్థ ఈఐయూ నివేదిక..
    నెటిజన్ల షాక్
  • బెంగళూరు చీప్ అయితే,
    హైదరాబాద్ మాటేంటని ప్రశ్న

దేశంలో ఖరీదైన నగరాలేంటి అనగానే..
బెంగళూరు, ఢిల్లీ, ముంబై అంటూ గడగడ సమాధానాలు వచ్చేస్తాయి. కానీ, అదేంటో ఎకనామిస్ట్​ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) మాత్రం ముంబైని పక్కనబెడితే మిగతా రెం డు సిటీలు భలే చీపు అనేస్తోంది. బ్రిటన్ కు చెందిన ఆ కంపెనీ ప్రపంచంలోని
అత్యం త నివాసయోగ్యమైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో బెంగళూరు, ఢిల్లీతో పాటు చెన్నై కూడా చోటు సంపాదించింది.

బెంగళూరుకు 5వ స్థానం రాగా, చెన్నై 8, ఢిల్లీ పదో స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఈఐయూ ఆ నివేదికను ఆదివారం విడుదల చేసింది. దానిని వరల్డ్​ ఇండెక్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక, ఈ జాబితాలో వెనెజులాకు చెందిన కరాకస్ సిటీ మొదటి స్థానం​లో నిలవగా, సిరియాలోని డమాస్కస్ రెండో స్థానాన్ని సాధించింది. అయితే, బెంగళూరును లిస్టులో చేర్చే సరికి నెటిజన్లు షాక్ కు గురయ్యారు. చెన్నై, ఢిల్లీతో పోలిస్తే బెంగళూరు చాలా ఖరీదైన సిటీ అంటూ నెటిజన్లు వరల్డ్​ ఇండెక్స్ పోస్ట్​ చేసిన రిపోర్టుకు కామెంట్లు పెట్టారు. దేశంలో హైదరాబాద్ కన్నా చీపైన సిటీ ఇంకొకటి లేదంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. హైదరాబాద్ , కోల్ కతా వంటి నగరాల్లో అయితే, డబ్బులు బాగా మిగులుతాయని ఇంకొందరు కామెంట్‌ చేశారు.