
లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా దశల వారీగా నడుస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో తన నామినేషన్ ఎప్పుడు వేస్తారని దాని గురించి క్లారిటీ వచ్చింది. మోదీ పోటీ చేసే వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికంటే ఒకరోజు ముందు మే 13న ఆ నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఇది మూడోసారి. ప్రధాని 2014లో తొలిసారి వారణాసి నుంచి ఎంపీ అయ్యారు. 2014లో నరేంద్ర మోదీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించారు.
వారణాసి నియోజకవర్గంలోని అయోధ్య రామమందిరాన్ని మే 5న మోదీ సందర్శించనున్నారు.రామ మందిరంలో పూజలు చేసి అయోధ్యలో భారీ రోడ్‌షో చేస్తారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ తర్వాత మోదీ రామ్‌లల్లా దర్శనానికి మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి. జూన్ 1న చివరి దశ లోక్ సభ ఎన్నికల్లో వారణానిలో పోలింగ్ జరుగనుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.