దేశంలో ఇంటర్నెట్‌‌‌‌ యూజర్లు 74 కోట్లు

దేశంలో ఇంటర్నెట్‌‌‌‌ యూజర్లు 74 కోట్లు
  •     వీరిలో జియో కస్టమర్లే 52 శాతం
  •     వైర్డ్​ ఇంటర్నెట్​ కనెక్షన్లలో బీఎస్ఎన్ఎల్​ టాప్

న్యూఢిల్లీ:  మన దేశంలో ఇంటర్నెట్‌‌ యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఇండియాలో నెట్​ వాడేవారి సంఖ్య 74.3 కోట్లకు చేరిందని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌‌) వెల్లడించింది. ఇందులో 52.3 శాతం మంది రిలయన్స్‌‌ జియో కస్టమర్లని.. 23.6 శాతం వాటాతో ఎయిర్‌‌టెల్‌‌ రెండోస్థానంలో, 18.7 శాతం మంది కస్టమర్లతో వొడాఫోన్‌‌ ఐడియా మూడోస్థానంలో ఉందని వివరించింది. గత ఏడాది డిసెంబరులో ఇంటర్నెట్‌‌ యూజర్ల సంఖ్య 71.8 కోట్లు కాగా, మార్చి ముగిసేసరికి ఇది 74.3 కోట్లకు చేరింది. మూడు నెలల్లో యూజర్ల సంఖ్య 3.40 శాతం పెరిగిందని ట్రాయ్‌‌ పేర్కొంది. మొత్తంగా వైర్‌‌లెస్‌‌ నెట్‌‌ యూజర్ల సంఖ్య 72.7 కోట్లుకాగా, మిగతావారు వైర్డ్‌‌  ఇంటర్నెట్‌‌ యూజర్లు. 96.9 శాతం మంది నెట్‌‌ కోసం మొబైల్స్‌‌నే వాడుతున్నారు. వైర్డ్‌‌  ఇంటర్నెట్‌‌ యూజర్ల సంఖ్య 3.02 శాతం వరకు ఉంది. అయితే వైర్డ్‌‌ ఇంటర్నెట్‌‌ మార్కెట్‌‌లో బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ 2.2 కోట్ల మంది యూజర్లతో మార్కెట్‌‌ లీడర్‌‌గా ఎదిగింది. రెండో స్థానంలో ఎయిర్‌‌టెల్‌‌ ఉందని ట్రాయ్‌‌ తెలియజేసింది.