పక్షుల కోసం ఆరు అంతస్థుల భవన నిర్మాణం

పక్షుల కోసం ఆరు అంతస్థుల భవన నిర్మాణం

రాజస్థాన్ జైపూర్ లోని పింజరా పోల్ గోశాల నిర్వాహకులు వినూత్న ప్రయోగం చేశారు. పక్షుల కోసం బర్డ్ హౌజ్ నిర్మించారు. 6 అంతస్తుల చిన్నపాటి భవనాన్ని నిర్మించారు గోశాల నిర్వాహకులు. 2వేల పక్షులకు ఇది ఆశ్రయమివ్వగలదని గోశాల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలు పెద్ద పెద్ద భవనాల్లో నివసిస్తున్నారని..కానీ పక్షుల గురించి మర్చిపోయారని అంటున్నారు గోశాల సభ్యుడు విజయవర్గీయ. అందుకే తాము పక్షుల కోసం బర్డ్ హౌజ్ నిర్మించామని చెబుతున్నారు. ఆకర్షణీయంగా నిర్మించిన బర్డ్ హౌజ్ ను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నారన్నారు. ఈ భవనంలో దాదాపు 2 వేల పక్షులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.