
‘ప్రభాస్’ సినిమా ‘రాజా సాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక మోహనన్. సోమవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తెలుపు రంగు చీరలో ట్రెడిషనల్‌గా కనిపించింది మాళవిక. ఆమధ్య విడుదల చేసిన టీజర్‌లోనూ స్టన్నింగ్ లుక్స్, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెస్మరైజ్ చేసిందామె. ఇక మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇక మోహన్‌లాల్‌కు జంటగా ఆమె నటించిన ‘హృదయపూర్వం’ ఈ నెల 28న విడుదల కానుంది. అలాగే కార్తికి జంటగా నటించిన తమిళ చిత్రం ‘సర్దార్ 2’ అక్టోబర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మొత్తానికి ఈ ఏడాది తన నుంచి ముచ్చటగా మూడు చిత్రాలు రాబోతున్నాయి.