V6 News

భర్త జాకీ చేత సారీ చెప్పించిన రకుల్.. 'సిట్యుయేషన్‌షిప్' వివాదంపై క్లారిటీ!.

 భర్త జాకీ చేత సారీ చెప్పించిన రకుల్.. 'సిట్యుయేషన్‌షిప్' వివాదంపై క్లారిటీ!.

బాలీవుడ్ క్యూట్ కపుల్ జాకీ భగ్నానీ, రకుల్ ప్రీత్ సింగ్ గత కొద్ది రోజులుగా  సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. లేటెస్ట్ గా జాకీ  తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి చేసిన ఒక చిన్న కామెంట్ పెద్ద దుమారమే రేపింది. తమ వైవాహిక బంధాన్ని ఆయన ‘సిట్యుయేషన్‌షిప్’ అని అభివర్ణించడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్లయ్యాక కూడా ఇలాంటి పదం వాడటం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

అసలు ఏం జరిగింది?

ఇటీవల ఒక  ఇంటర్వ్యూలో జాకీ మాట్లాడుతూ, మేము పెళ్లి చేసుకున్నాం, కానీ మా మధ్య ఉన్నది ఒక సిట్యుయేషన్‌షిప్ లాంటిది. రకుల్, నేను ఒకరికొకరు ఎంతో నిజాయితీగా ఉంటాం. అంతకు మించి, నేను ఆమెతో ఏదైనా మాట్లాడగలను అని వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన ఉద్దేశం తమ బంధం చాలా స్వేచ్ఛగా, స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పడమే అయినప్పటికీ, ‘సిట్యుయేషన్‌షిప్’ అనే పదం వాడటంతో అది పెద్ద దుమారానికి దారితీసింది.

సారీ చెప్పిన జాకీ..

ఈ వివాదంపై రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గా చాలా సరదాగా స్పందిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశారు. జాకీ పక్కన ఉండగానే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను. మనం మిలీనియల్స్ అని .. ఈ జెన్ జీ పదాలు వాడాల్సిన అవసరం లేదని చెప్పానా లేదా? ఇప్పుడు చూడు ఏమైందో అంటూ ఆటపట్టించారు. దీనికి జాకీ తన చెవులు పట్టుకుని సారీ చెప్పారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు  అంటూ వివరణ ఇచ్చారు.  దీనికి రకుల్ నవ్వుతూ.. ఈ ప్రపంచానికి ఈ విషయం తెలియాలి. సరే నెటిజన్లు,మీడియా ఎలాగూ ఆపడం లేదు కాబట్టి, మేము కూడా దీనిపై నవ్వుకుని వదిలేయాలని  నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చారు. ఇక మీ గోల ఆపండి.. నవ్వుకోండి, వదిలేయండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ జంట..

రకుల్ అసహనం..

అంతకుముందు కూడా ఈ విషయంపై రకుల్ సీరియస్  కూడా స్పందించారు. గంటల కొద్దీ జరిగిన సంభాషణలో ఒక చిన్న ముక్కను తీసుకుని హెడ్‌లైన్స్‌గా మార్చడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. సందర్భం (Context) ముఖ్యం. సంభాషణల్లోని లోతును చూడకుండా కేవలం క్లిక్‌బైట్ కోసం ఇలా చేయడం సరికాదు. మీడియా సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలి అని ఆమె చురకలు అంటించారు.

మా బంధం ప్రత్యేకమైనది..

రకుల్ తన వైవాహిక జీవితం గురించి చెబుతూ.. మాది ఒకరి లోటును మరొకరు భర్తీ చేసుకునే బంధం కాదు. నువ్వు నన్ను హాలిడేకి తీసుకెళ్లలేదు కాబట్టి నేను అసంతృప్తిగా ఉన్నాను అని అనుకునే రకం కాదు నేను. ఆ హాలిడేకి నేను ఒంటరిగా కూడా వెళ్లగలను. అంతకు మించిన ముఖ్యమైన విషయాలు మా మధ్య ఉన్నాయి అని స్పష్టం చేశారు.