షాపింగ్ మాల్స్ లో చేనేత, జౌళిశాఖ రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ తనిఖీలు 

షాపింగ్ మాల్స్ లో చేనేత, జౌళిశాఖ రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ తనిఖీలు 

నల్గొండ జిల్లా కేంద్రంలో చేనేత, జౌళిశాఖ రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ తనిఖీలు చేపట్టింది. చేనేత రంగానికి రిజర్వ్ చేసిన దోతులను మరమగ్గాలపై అక్రమంగా తయారు చేయడంపై సీరియస్ అయ్యింది. మరమగ్గాలపై తయారు చేస్తున్న వస్త్రాలతో పాటు స్వర్ణ కంచి మెగా షోరూమ్ లోనూ తనిఖీలు చేపట్టారు జౌళిశాఖ  రాష్ట్ర ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ సభ్యులు. 

ప్రింట్ చేసిన పోచంపల్లి ఇక్కత్, గద్వాల వస్త్రాలను చేనేత వస్త్రాల పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారని గుర్తించారు. కొన్ని ప్రింటెడ్ వస్త్రాలను సీజ్ చేశారు. ఫేక్ చేనేత వస్త్రాలు అమ్ముతున్న స్వర్ణ కంచి మెగా షోరూమ్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు. సీజ్ చేసిన వస్త్రాలను చెన్నైలోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపిస్తున్నామని అధికారులు చెప్పారు.