చిన్నారి ప్రాణం కాపాడి ఓ ట్రాఫిక్ హోంగార్డు ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ లోని రాజీవ్ చౌక్‌లో రామకృష్ణ మలక్‌పేట ట్రాఫిక్ హోంగార్డు విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాగిన మత్తులో ఓ యాచకురాలు సంవత్సరం చిన్నారిని కోణార్క్ థియేటర్ ముందున్న చెత్త బుట్టలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు హోమ్ గార్డ్ కు తెలియజేశారు. దీంతో హోంగార్డు రామకృష్ణ వెంటనే సంఘటనా ప్రాంతానికి పరుగులు తీశారు. ఆ చిన్నారికి సపర్యలు చేసి, చివరగా తల్లి ఒడికి చేర్చారు. హోంగార్డు రామకృష్ణ చూపిన మానవత్వానికి, చేసిన పనికి స్థానికులు అభినందనలు తెలియజేశారు.
