మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఎవరు : 43 శాతం రైలు ప్రమాదాలు ఉద్యోగుల తప్పిదాల వల్లే

మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఎవరు : 43 శాతం రైలు ప్రమాదాలు ఉద్యోగుల తప్పిదాల వల్లే

2021-22 సంవత్సరంలో రైల్వే సిబ్బంది పనిలో లోపం కారణంగా రైలు ప్రమాదాల శాతం 42.86% అని రైల్వే సేఫ్టీ డేటా కమిషన్ తెలిపింది.

జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణించగా, 1000 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే భారతదేశంలోని రైళ్ల భద్రతపై దృష్టి సారించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్యగా చెప్బుతున్నప్పటికి, విషాద ప్రమాదానికి కారణమైన ఇతర అంశాలను సీబీఐ, రైల్వే దర్యాప్తు బృందం పరిశీలిస్తోంది.

భారతదేశంలో రైలు భద్రత, ప్రమాదాల స్థితిపై వార్షిక నివేదికలను ప్రచురించే రైల్వే సేఫ్టీ కమిషన్ ఈ సందర్భంగా 2021-22 సంబంధించి నివేదికలోని ముఖ్యమైన వివరాలను పంచుకుంది. ఈ రిపోర్ట్ ప్రకారం, రైల్వే సిబ్బంది పనిలో లోపం కారణంగా రైలు ప్రమాదాల శాతం 2020-21లో 59.09 శాతం ఉండగా 2021-22లో 42.86 శాతంగా ఉంది. మానవ వైఫల్యం కాకుండా 2021-22 సంవత్సరానికి 72.72% రైలు ప్రమాదాలు జరగగా, 54.28% రైలు ప్రమాదాలు 2020-21 సంవత్సరంలో జరిగినట్టు నివేదిక పేర్కొంది.

2017 నుంచి 2022 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఈ ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల సంఖ్యను కూడా నివేదిక వెల్లడించింది. 2017-18 సంవత్సరంలో 79 ప్రమాదాలు చోటుచేసుకోగా అందులో ఆరు ప్రమాదాలు తీవ్రమైనవి కాగా మూడు ప్రమాదాలు ప్రయాణీకుల మరణాలకు కారణమయ్యాయి. ఇందులో రైల్వే సిబ్బంది, బయటి వ్యక్తులతో సహా మరణాల సంఖ్య 26. 2018-19 సంవత్సరంలో 63 ప్రమాదాలు జరిగాయి. వాటిలో తొమ్మిది ప్రమాదాలు తీవ్రమైనవి కాగా, ఎనిమిది ప్రమాదాలు ప్రయాణీకుల మరణాలకు కారణమయ్యాయి. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బందితో పాటు చనిపోయిన వారి సంఖ్య 25.

2019-20 సంవత్సరంలో, 57 ప్రమాదాలు జరిగాయి. వాటిలో 10 ప్రమాదాలు తీవ్రమైనవి, అయితే ఈ సంవత్సరంలో మానవ తప్పిదాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇందులో రైల్వే సిబ్బంది, బయటి వ్యక్తులతో సహా మరణించిన వారి సంఖ్య 12. 2020-21 సంవత్సరంలో 22 ప్రమాదాలు జరిగాయి. వాటిలో రెండు ప్రమాదాలు తీవ్రమైనవి. ఇందులో రైల్వే సిబ్బంది, బయటి వ్యక్తులతో సహా మరణాల సంఖ్య నాలుగు.

2022-23 డేటా కోసం వెయిటింగ్..

2021-22 సంవత్సరంలో 35 ప్రమాదాలు జరిగాయి. వాటిలో రెండు ప్రమాదాలు తీవ్రమైనవి కాగా, అందులో రెండు ప్రమాదాలు ప్రయాణీకుల మరణాలకు కారణమయ్యాయి. ఇందులో రైల్వే సిబ్బంది, బయటి వ్యక్తులతో సహా మరణాల సంఖ్య 17. కాగా 2022-23కి సంబంధించిన డేటా ఇంకా ప్రచురించబడలేదు.