పాకిస్తాన్ ముందే సమాచారం ఇవ్వాల్సింది

పాకిస్తాన్ ముందే సమాచారం ఇవ్వాల్సింది

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి కారణంగా మూసేసి ఉన్న కర్తార్‌‌పూర్ కారిడార్‌‌ను సిక్కు యాత్రికుల కోసం మళ్లీ తెరవడానికి సిద్ధంగా ఉన్నామని దాయాది పాకిస్తాన్ తెలిపింది. ఈ నెల 29 నుంచి కర్తార్‌‌పూర్ కారిడార్‌‌ను తిరిగి తెరవడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చింది. అయితే కరోనా భయంతో క్రాస్ బార్డర్ ట్రావెల్‌పై ప్రస్తుతం ఉన్న నిషేధం అలాగే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై హెల్త్ అథారిటీస్‌ను సంప్రదించి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ‘కర్తార్‌‌పూర్ కారిడార్‌‌ తెరవడంపై రెండ్రోజుల ముందు సమాచారం ఇవ్వడం సరికాదు. దైపాక్షిక ఒప్పందాల ప్రకారం ప్రయాణానికి కనీసం 7 రోజుల ముందు మాకు సమాచారం అందించాల్సింది. దీంతో మేం ముందే అడ్వాన్స్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టడానికి అవకాశం ఉండేది’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.