వచ్చే ఏడాది సెలవులు  ప్రకటించిన సర్కారు

వచ్చే ఏడాది సెలవులు  ప్రకటించిన సర్కారు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రభుత్వం వచ్చే ఏడాది జనరల్‌‌‌‌ హాలీడేస్‌‌‌‌, ఆప్షనల్‌‌‌‌ హాలీడేస్​ని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్‌‌‌‌ శుక్రవారం 2 వేర్వేరు గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్లు ఇచ్చారు. 23 పబ్లిక్‌‌‌‌, 28 జనరల్‌‌‌‌ హాలీడేస్‌‌‌‌ను నోటిఫికేషన్‌‌‌‌లో ప్రకటించారు. ఇదుల్‌‌‌‌ ఫితర్‌‌‌‌, ఇదుల్‌‌‌‌ అఝా, మొహర్రం, ఈద్‌‌‌‌ ఇ మిలాద్‌‌‌‌ సమయాల్లో చంద్రవంకను బట్టి సెలవును డిక్లేర్‌‌‌‌ చేయనున్నారు. 23 ఆప్షనల్‌‌‌‌ హాలీడేస్‌‌‌‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఏవైనా 5 రోజులు సెలవుగా తీసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆది, రెండో శనివారాలు బంద్‌‌‌‌ ఉంటాయి. జనవరి ఒకటో తేదీ సెలవుగా ప్రకటించి, ఫిబ్రవరి 12న రెండో శనివారం మాత్రం పనిదినంగా పెట్టారు.