టీవీ లెజెండ్ ఓ డాగ్ లవర్

టీవీ లెజెండ్ ఓ డాగ్ లవర్

‘‘మనుషులుగా మనకు సాయం చేయడానికి తోటి వాళ్లున్నారు. కానీ, నోరు లేని ప్రాణుల్ని పట్టించుకునేదెవరు?. భూమ్మీద ప్రతీ ప్రాణి బ్రతకాలి. ప్రతీ ప్రాణిని బతకనివ్వాలి’’ అంటారు సైమన్ కోవెల్. అమెరికాస్ గాట్ టాలెంట్ షోకి జడ్జిగా వ్యవహరిం చే కోవెల్.. ఫేమస్ టీవీ పర్సనాలిటీ. ఆ షోలో పార్టిసిపెంట్స్ పర్ ఫార్మెన్స్ కి ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్.. ఎంకరేజ్ మెం ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాం టి వ్యక్తి చేసిన ఓ సాయం వందల కుక్కల ప్రాణాల్ని నిలబెట్టింది. సైమన్ కోవెల్.. ఇంగ్లీష్ రియాలిటీ షోలు చూసేవాళ్లకి బాగా తెలుసు. 58 ఏళ్ల కోవెల్ కి కుక్కలంటే చాలా ఇష్టం . యానిమల్ ఎబ్యూజింగ్ ను అడ్డుకునేం దుకు పని చేస్తు న్న ‘హెచ్ ఎస్ ఐ’ అనే ఛారిటబుల్ ట్రస్ట్ కి ఈమధ్య 25 వేల పౌండ్ల డొనేషన్ ఇచ్చాడు కోవెల్. ఆ డబ్బుతో సౌత్ కొరియాలో ఓ కుక్కల భారీ కబేళాను క్లోజ్ చేయించింది ఆ ట్రస్ట్. వాటిని రక్షించి సేఫ్ ప్లేస్ కి తరలిస్తోంది.                      అమెరికా, కెనెడా, నెదర్లాం డ్స్, యూకేల్లో వాటిని దత్తత తీసుకునేవారి కోసం ఎదురుచూస్తోంది హెచ్ ఎస్ ఐ. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్తావిస్తూనే సైమన్ మంచి మనసు గురించి పేర్కొంది ఆ ట్రస్ట్. ‘మూగజీవుల పట్ల మరోసారి మానవత్వం ప్రదర్శించాడు సైమన్ కోవెల్. ఆయన చేసిన సాయంతో కుక్కల్ని రక్షించాం ’ అని పేర్కొంది. ఈ సాయంపై యానిమల్ లవర్స్ కోవెల్ కి థ్యాం క్స్ చెప్తున్నా రు.

డాగ్ మీట్ వద్దు

ది ఎక్స్ ఫ్యాక్టర్, బ్రిటన్స్ గాట్ టాలెంట్, అమెరికన్ ఐడల్, అమెరికాస్ గాట్ టాలెంట్.. ఈ షోలన్నింటికి జడ్జిగా సైమన్ కోవల్ ఫేమస్. ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా కెరీర్ ప్రారంభించి .. డిఫరెం ట్ కాన్సెప్ట్ లతో బుల్లితెరపై ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ఇటు ఇంగ్లాండ్ లోనూ, అటు అమెరికాలోనూ మోస్ట్ ఇన్ ఫ్లూయన్స్డ్ టీవీ సెలబ్రిటీ ఈయన. స్వతహాగా డాగ్ లవర్ అయిన సైమన్ కోవెల్.. తన రెండు ఇళ్లలో వందల కుక్కల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేశాడు కూడా. ఇంతకు ముందు #EndDogMeat మూమెంట్ తెరపైకి వచ్చి నప్పుడు ముందుండి నడిపించింది ఈయనే. ముఖ్యంగా కుక్కల్ని ఎక్కువగా తినే సౌత్ కొరియా ప్రజల లైఫ్ స్టైల్ ను తప్పుబడుతూ కాంట్రవర్సీ కామెం ట్స్ చేశాడు. గతంలో బ్రిటన్స్ గాట్ టాలెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు తన పెంపుడు కుక్కలతో యోగాసనాలు వేసి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు ఈ టెలివిజన్ లెజెండ్.