ఒక్క మరుగు దొడ్డి డిజైన్ చేస్తే రూ.27లక్షల ప్రైజ్ మనీ

ఒక్క మరుగు దొడ్డి డిజైన్ చేస్తే రూ.27లక్షల ప్రైజ్ మనీ

మీరు కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం ఈ ఇన్నోవేషన్ లో పాటిస్పేట్ చేయండి లక్షలు గెలుచుకోండి.

అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నాసా 2024లో చంద్రమండలంపై మానవుడు జీవించేలా పరిశోధనలు జరుపుతోంది. ప్రస్తుతం ఆ ప్రయోగాలు దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ నాసా కు ఒక చిక్కొచ్చి పడింది  అదే టాయిలెట్స్. అంతరిక్షంలో  టాయిలెట్స్ ను ఏర్పాటు చేయడం కష్టం గా మారింది.

మనం నివసిస్తున్న భూమి మీద కంటే చంద్రమండలంపై నివసించడం చాలా కష్టం. ఉదాహరణ కు మనం భూమి మీద యూరిన్ కు శుభ్రంగా వెళ్లొచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు . కానీ చంద్రమండలంపై అలా కాదు గురుత్వాకర్షణ శక్తి లేనందున మలానికి, మూత్రానికి వెళ్లలేము. అందుకే నాసా సైతం ఈ టాయిలెట్ బాధల్ని తీర్చేలా ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా చంద్రమండలంపైన నివసించే సామాన్యులకు లేదంటే ఆస్ట్రోనాట్స్ యూరిన్ కు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టాయిలెట్స్ ను తయారు చేయాలని భావించింది. ఇందుకోసం ప్రపంచ దేశాల ప్రజలకు నాసా ఓ పిలుపునిచ్చింది. నాసా హ్యూమన్ ల్యాండింగ్ సిస్టం అనే కాంటెస్ట్ ను ఏర్పాటు చేసింది.

ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న ఔత్సాహికులు  నాసా కోసం ప్రత్యేకంగా టాయిలెట్ ను డిజైన్ చేయాలి. నాసా సూచించిన విధంగా  0.12 క్యూబిక్ మీటర్లు (4.2 క్యూబిక్ అడుగులు) కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకూడదు. 60 డెసిబెల్స్  శబ్దం స్థాయిలో పనిచేయాలి,  ఒకేసారి ఒక లీటరు మూత్రం మరియు 500 గ్రాముల మలాలను సేకరించగలగాలి. మహిళలు 114 గ్రాముల రుతుస్రావం నిండాలి.  ఆస్ట్రోనాట్స్  మహిళలు, పురుషుల తలలు టాయిలెట్ లో కాకుండా భయట ఉండేలా అంటే మెడ నుంచి అరికాళ్ల వరకు పూర్తిగా కప్పుకొని ఉండాలి.  టాయిలెట్ ను నిర్విరామంగా ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి..దాన్ని క్లీన్ చేసేందుకు 5నిమిషాలకంటే ఎక్కువ టైమ్ పట్టకూడదు. మలమూత్రాల్ని నిల్వ చేసేలా టాయిలెట్ ను డిజైన్ చేయాలి . అలా ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్లకి నాసా 27లక్షల ఫ్రైజ్ మనీ ఇవ్వనుంది. అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేస్తే అదనంగా కొంత మొత్తాన్ని అందిస్తుంది.  ఈ కాంటెస్ట్ లో పాటిస్పేట్  చేసేందుకు ఆగస్ట్ 17వరకు అవకాశం ఉంది. ఫస్ట్, సెకండ్ థర్డ్ ఇలా మూడు స్థానాల్లో టాయిలెట్ డిజైన్ చేసిన అభ్యర్ధులకు ప్లేసుల్ని బట్టి ప్రైజ్ మనీ అందిస్తున్నట్లు నాసా ప్రకటించింది.