అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అంబులెన్స్ లోనే ప్రసవించింది మహిళ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.  వివరాల్లోకి వెళ్లితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన గంట స్వప్న అనే గర్భిణికి మే 15, 2024 బుధవారం తెల్లవారుజామున పురిటినొప్పులు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆమె భర్త 108కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ తో స్వప్న ఇంటి చేరుకున్నారు. అప్పటికే ప్రసవానికి దగ్గరపడుతూ నొప్పులు బరిస్తున్న మహిళ  అంబులెన్స్ ఎక్కి ఆస్పత్రికి వెళ్తున్న మార్గమధ్యలోనే ప్రసవించింది. మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీకొడుకులు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. సకాలంలో అంబులెన్స్ సేవలు అందించిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. హైవేలపై వెళ్తున్నప్పుడు అంబులెన్స్ లకు దారి ఇవ్వాలని.. ఎవరో ఒకరు ఆపదలో ఉండే ఉంటారని వారికి సహాయం చేయకపోయిన అంబులెన్స్ కు దారి ఇస్తే ఎంతో మేలు చేసిన వారు అవుతారని కామెంట్ చేస్తున్నారు.