OTT Series: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ ట్రెండింగ్‌.. వారంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్

OTT Series: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్ ట్రెండింగ్‌.. వారంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో కె.వి. శ్రీరామ్ నిర్మించారు. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌‌‌‌ వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి  మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘ఈ సిరీస్‌‌‌‌కు ఇంతమంచి ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది.  టీమ్  అందరి ఎఫర్ట్‌‌‌‌తోనే ఇదంతా సాధ్యమైంది.  ఇలాంటి మంచి సిరీస్‌‌‌‌లో భాగమవ్వడం  అదృష్టం’ అని అన్నారు. తను పోషించిన రెబెకా పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందని ఉదయభాను చెప్పింది.

తమ  సిరీస్‌‌‌‌ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌‌‌‌కి థ్యాంక్స్  అని దర్శకుడు కృష్ణ పోలూరు చెప్పాడు.   ప్రస్తుత తరంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్‌‌‌‌ను ఈ చిత్రంలో చూపించామని నిర్మాత కె.వి. శ్రీరామ్ అన్నారు.  నటి వాసంతిక,  జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ పాల్గొన్నారు.

కథ:

ఈ వెబ్ సిరీస్ ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే గాఢమైన అనుబంధం చుట్టూ తిరుగుతుంది. రాజీవ్ కనకాల 'ప్రసాద్ రావు' అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో కనిపిస్తుండగా, నటి వసంతిక ఆయన కూతురు 'స్వాతి' పాత్రలో నటించింది. తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఎంతో కష్టపడి ఉద్యోగంలో చేరిన స్వాతి, అందరూ గర్వపడేలా ఎదుగుతుంది.

►ALSO READ | Mrithyunjay Review: శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ రివ్యూ.. మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే థ్రిల్లర్!

అయితే, కథలో ఊహించని మలుపు స్వాతి అదృశ్యం కావడంతో మొదలవుతుంది. తన ప్రాణప్రదమైన కూతురు ఏమైందో తెలియక ఆ తండ్రి పడే వేదన, ఈ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న మిస్టరీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ కేసును ఛేదించే బాధ్యతను పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా ఉదయభాను స్వీకరిస్తుంది.

చాలా కాలం తర్వాత ఉదయభాను ఒక సీరియస్ రోల్‌లో కనిపించడం ఆకర్షణగా నిలిచింది. స్వాతిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆమెను టార్గెట్ చేయడం వెనుక ఉన్న సామాజిక కారణాలు ఏంటి? క్లిష్టమైన ఈ కేసును ఉదయభాను ఎలా ఛేదించిందనేది కథలో కీలకమైన అంశం.