దెబ్బకు దెబ్బ.. అమెరికా ట్యాంకర్ను పేల్చేసిన ఇరాన్.. 24 గంటల్లోనే బదులిచ్చామంటూ ప్రకటన

దెబ్బకు దెబ్బ.. అమెరికా ట్యాంకర్ను పేల్చేసిన ఇరాన్.. 24 గంటల్లోనే బదులిచ్చామంటూ ప్రకటన

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా రంగంలోకి దిగిన ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. మిడిల్ ఈస్ట్ లో యూఎస్ స్థావరాలు లేకుండా చేస్తామని హెచ్చరించిన ఇరాన్.. అన్నట్లుగానే గల్ఫ్ దేశాలలో ఉన్న స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం తీవ్రంగా మారిన క్రమంలో హిందూ మహాసముద్రంలోని భారత జలాల్లో ఇరాన్ షిప్ ను అమెరికా జలాంతర్గామితో పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.. అన్నంత పనిచేసింది. అమెరికా ట్యాంకర్ ను పేల్చేసినట్లు ప్రకటించింది. 

ఉత్తర పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ ను పేల్చేసినట్లు గురువారం (మార్చి 05) ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. యూఎస్ నౌక తగలబడుతోందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది. 

యూఎస్ జలాంతర్గామి ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసిన 24 గంటల్లోనే ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడం గమనార్హం. శ్రీలంక తీరానికి సమీపంలో జరిగిన ఈ దాడిలో అమెరికా నౌక మంటల్లో కాలిపోయింనీ.. ద దెబ్బకు దెబ్బ తీశామని IRGC ప్రకటించింది. 

విశాఖపట్నంలో రెండు రోజుల నవికా విన్యాసాల (naval exercises) లో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో IRIS దెనా అనే వార్ షిప్ ఇండియాకు వచ్చింది. తిరిగి ఇరాన్ వెళ్తున్న క్రమంలో యూఎస్ టార్పెడో తో పేల్చేశారు అమెరికా సైనికులు. హఠాత్తుగా జరిగిన దాడిలో 87 మంది సైనికులు చనిపోయారు. 60 మంది తప్పిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్.. అదే తీవ్రతతో అమెరికాకు చెందిన నౌకను పేల్చేయడం గమనార్హం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.