ఉపాసన కుటుంబంలో విషాదం.. తాత కామినేని ఉమాపతి రావు మృతి

ఉపాసన కుటుంబంలో విషాదం.. తాత కామినేని ఉమాపతి రావు మృతి

కామారెడ్డి జిల్లా : రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుటుంబంలో విషాదం నెల‌కొంది. దోమకొండ కోట వంశీయుడు, ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు  (92) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హస్పటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వయస్సు పైబడడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు సమాచారం. ఉమాపతి రావు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో జన్మించారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. ఉమాపతి రావు మృతితో కామినేని కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు. భావోద్వేగానికి గురైన ఉపాస‌న..‌ సోషల్ మీడియా ద్వారా తన తాతయ్యకు నివాళులు అర్పించింది. ఉమాపతిరావు అంత్యక్రియలు గురువారం దోమకొండలోనే జరుగను‌న్నాయి. అంత్యక్రియలకు సినీ నటులు చిరంజీవి, రాంచరణ్ లు హాజరవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.