Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!

 Salaar 2: ప్రభాస్ ఫ్యాన్స్కి అదిరిపోయే న్యూస్..సలార్ శౌర్యంగ పర్వం వచ్చేస్తోంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్(Kgf) చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకుంది. 

రెండు పార్టీలుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే.ఇక రెండో పార్ట్ కోసం పార్టీ 1 చివర్లో అదిరిపోయే ట్విస్టు ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.రెండు పార్ట్ కు శౌర్యంగ పర్వం( Shouryanga Parvam) అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

చాలా రోజుల నుండి సలార్-శౌర్యంగ పర్వం అనే టైటిల్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే పార్ట్ 2 ఎప్పుడు షురూ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినబడుతూ వస్తున్నాయి. 

తాజాగా అందుతున్న సమాచారం మేరకు..మరి కొద్ది రోజుల్లోనే సలార్ 2 సినిమా షూటింగ్ త్వరలో షురూ కాబోతుంద. ఈ నెలాఖరులో (మే) రామోజీ ఫిలిం సిటీలో పది రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ తో షూటింగ్ షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత మూడు నెలల నుంచి డైరెక్టర్ ప్రశాంత్, అతని టీం అంతా కలిసి కలిసి సలార్ 2 స్క్రిప్ట్ పనిలో నిమగ్నం అయ్యారని..ఇక అతి త్వరలో స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.  దీంతో పది రోజుల పాటు షూట్ చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. 

అంతేకాదండోయ్..మరో ఆసక్తికరమైన బజ్ కూడా వినిపిస్తోంది. అదేంటంటే..ఈ ఏడాదిలో అంటే (2024లో) సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి, వచ్చే ఏడాది (2025) మొదటి త్రైమాసికంలోనే దాదాపుగా ప్యాచ్ వర్క్ లు ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ప్రశాంత్ వెళతారని తెలుస్తోంది. 

ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీతో పాటు బెంగుళూరు అవుట్ స్కర్ట్స్ లో షూటింగ్ కోసం స్పెషల్ సెట్స్ నిర్మిస్తున్నట్లు టాక్ అయితే ఉంది. అంటే వచ్చే ఏడాది ఎండింగ్ లోపుసలార్ 2 రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక మొదటి భాగంలో రివిల్ చేసినట్లుగా ప్రాణ స్నేహితులుగా ఉన్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్, ప్రభాస్ ఎలా ప్రాణాలు తీసుకునేంత శత్రువులు అయ్యారు అనే లైన్ లోనే సినిమా ఆసక్తికరంగా సాగనుంది.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి, మారుతీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ మాత్రం ఖాళీ టైం దొరికిన సలార్ 2 సెట్ లో పాల్గొనే ఛాన్స్ ఉంది.