
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఉమా రామనన్(Uma Ramanan) (72) బుధవారం కన్నుమూశారు. ఆమె మృతికి కారణం అనారోగ్య సమస్యలే అని తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఉమా రామనన్ తన 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కేవలం పాటలు పడటమే కాకుండా.. ఆరువేల కంటే ఎక్కువ ప్రత్యేక్ష ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. దీంతో ఆమె మృతిపట్ల ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
ఇక ఉమా రామనన్ విషయానికి వస్తే.. సినీ సంగీత ప్రపంచంలోని సంగీత దిగ్గజాలు అందరితో పనిచేశారు. ఇళయరాజ, విద్యాసాగర్, దేవా, మణిశర్మ వంటి గొప్ప వ్యక్తులతో కలిసి తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు ఉమా రామనన్. తెలుగులో ఆమె చివరిగా ఓ చిన్నదాన అనే సినిమాలో పాడారు.