డిస్పోజబుల్​ యూరిన్​ బ్యాగ్స్

 డిస్పోజబుల్​ యూరిన్​ బ్యాగ్స్

సమస్య ఎదురైనప్పుడు..అప్పటికి సొల్యూషన్​ వెతుక్కుని రిలాక్స్​ అయ్యేవాళ్లు కొందరైతే..  ఆ సమస్యకి పర్మినెంట్​ సొల్యూషన్​​ వెతికేవాళ్లు ఇంకొందరు. ఈ రెండో కోవకే చెందుతాడు సిద్ధాంత్​ తవరవాలా. తనలా మరెవరూ ఇబ్బంది పడొద్దన్న ఆలోచనతో  ఎకో– ఫ్రెండ్లీ డిస్పోజబుల్ యూరిన్​ బ్యాగ్స్​ తయారుచేశాడు. పీస్చ్యూట్ అనే బ్రాండ్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చాడు. 
పబ్లిక్​ టాయిలెట్స్​ సరిపడా లేక, అవేర్​నెస్​ లేకపోవడం, జనాలు చూసీచూడనట్టు వదిలేయడం.. ఇలా కారణం ఏదైతేనేం చాలామంది ఫుట్​​ పాత్​లపై, ఖాళీ స్థలాల్లో యూరిన్​ చేస్తుంటారు. అన్నింటికీ మించి టాయిలెట్స్​ శుభ్రంగా లేక యూరిన్​ని బలవంతంగా ఆపుకుంటారు కొందరు.  దీనివల్ల యూరినరీ ట్రాక్​ ఇన్ఫెక్షన్లతో పాటు ఇంకా రకరకాల సమస్యలొస్తాయి. అలాగని  శుభ్రంగా లేని టాయిలెట్స్​ ఉపయోగించినా ఇబ్బందే. అందుకే వీటన్నింటికీ సొల్యూషన్​గా డిస్పోజబుల్​ పీ(యూరిన్)​ బ్యాగ్స్​ తయారుచేశాడు సిద్ధాంత్​. ఈ ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే... తనకొచ్చిన సమస్య నుంచే అని చెప్పాడు.

అప్పుడొచ్చింది ఈ  ఆలోచన..
మహారాష్ట్రలోని జల్నాలో  పుట్టి, పెరిగాడు 38 ఏండ్ల సిద్ధాంత్​. చిన్నప్పట్నించీ ట్రావెలింగ్​ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో  నెలకో ట్రిప్​ వేస్తుండేవాడు. అయితే ఎక్కడికెళ్లినా వాష్​రూమ్స్​ శుభ్రంగా ఉండేవి కాదు. దాంతో ఈ సమస్యకి ఏదైనా సొల్యూషన్​ వెతకాలనుకున్నాడు. సరిగ్గా అప్పుడే  తను చదువుకుంటున్న ఇంజినీరింగ్​ కాలేజీలో ఎంట్రప్రెనూర్​ వర్క్​షాప్​ పెట్టారు. అందులో పాల్గొన్నాక డిస్పోజబుల్​ యూరిన్​ బ్యాగ్స్​ తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ వెంటనే గ్రౌండ్​వర్క్​ మొదలుపెట్టాడు. లిక్విడ్​ని నిల్వ చేసే  చాలా రకాల మెటీరియల్స్​ని​ టెస్ట్​ చేశాడు​. వాటర్​ బాటిల్స్​, పేపర్​ బ్యాగులు, బెలూన్స్​.. ఇలా అన్నింటితో ప్రయోగాలు చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘నిధి ప్రయాస్​​’కి తన ఆలోచన పంపాడు.. ప్రొడక్ట్​ ప్రోటో టైప్​ని డెవలప్​ చేయడానికి  పది లక్షలు ఫండ్స్​ ఆ స్కీమ్​ కింద తీసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్​ మీద దాదాపు పద్నాలుగు నెలలు పనిచేసి డిస్పోజబుల్​ యూరిన్​ బ్యాగ్స్​ని 2020లో ‘ పీస్చ్యూట్​’ పేరుతో మార్కెట్​లోకి తీసుకొచ్చాడు. ​ అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ లాంటి ఈ కామర్స్​ సైట్స్​లో రూ. 15 కి ఒక్కో బ్యాగుని అమ్ముతున్నాడు​ . 

కాస్త చోటుంటే చాలు
ఈ డిస్పోజబుల్​ యూరిన్​ బ్యాగ్స్​ని పేపర్​తో తయారుచేశాడు సిద్ధాంత్​. పాకెట్​ సైజ్​ ఉండే ఈ బ్యాగ్స్​లో  స్పెషల్​ జెల్​ ఉంటుంది. అది యూరిన్​ని సాలిడ్​గా మార్చేస్తుంది. వాసన కూడా రాదు. లీకేజ్​ సమస్య ఉండదు. వాడిన తర్వాత తేలిగ్గా సీల్​ చేసి పడేయొచ్చు. బయట పడేయడం ఇష్టం లేదనుకుంటే ఇంటికి తీసుకెళ్లి డిస్పోజ్​ చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లా పబ్లిక్​ ప్లేస్​ల్లో ఈ బ్యాగ్స్​ ఎలా వాడాలన్నదే. దాంతో మళ్లీ నాలుగు నెలలు వర్క్​ చేసి ప్లగ్ అండ్​ ప్లే యూరినల్​ సొల్యూషన్స్​ని తీసుకొచ్చాడు. రీసైక్లింగ్ ప్లాస్టిక్​ ప్యానెల్స్​తో ‘ పీస్చ్యూట్​ బక్సా’ పేరుతో ఫోల్డబుల్ వాష్​రూమ్​ని తయారుచేశాడు. దీని లోపలికి వెళ్తే సెన్సర్​ ద్వారా లైట్స్​ వెలుగుతాయి. యూరిన్​ బ్యాగ్స్​ ఉంటాయి. ఆటోమెటిక్​ ఫ్లష్​ సిస్టమ్​ కూడా ఉంటుంది. అలాగే యూరిన్​ బ్యాగ్​ ఎనభై శాతం నిండగానే.. బ్యాగ్​ మార్చుకోమని అలారం కూడా మోగుతుంది. ప్రస్తుతం వీటిని మహారాష్ట్రలోని కొన్ని  మార్కెట్లు​, స్కూల్స్​, కాలేజీల్లో ఏర్పాటు చేశాడు సిద్ధాంత్​. త్వరలో 15, 000 రూపాయలకి ఈ టాయిలెట్స్​ని మార్కెట్​లోకి తీసుకురానున్నాడు. ‘‘డ్రైనేజీ​, ప్లంబింగ్​, సిమెంట్, స్టీల్​.. ఇవేం అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో ఈ టాయిలెట్​ని 10 స్క్వేర్​ ఫీట్ల స్థలంలో ఇన్​స్టాల్​ చేసుకోవచ్చు’’ అంటున్నాడు సిద్ధాంత్​.