ఐపీఎల్ 2026లో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చి, ప్రపంచ దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్ సూర్యవంశీ హాట్ టాపిక్ గా మారిపోయాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన ఈ యువ సంచలనం, తన బ్యాటింగ్‌తోనే కాకుండా తన అల్లరితోనూ నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాడు.
ఫొటో కోసం రూ. 100:
తాజాగా వైభవ్ సూర్యవంశీ తన చిలిపి తనంతో వార్తల్లో నిలిచాడు. తనతో ఫొటో దిగేందుకు వచ్చిన ఇద్దరు చిన్నారులను చూసి వైభవ్ సరదాగా ప్రాంక్ చేశాడు. నేను ఫొటో దిగాలంటే ఒక్కో దానికి రూ. 100 ఇవ్వాలి అని అనడంతో, ఆ పిల్లలు అమాయకంగా రూ. 200 తెచ్చామని చెప్పారు. ఇది చూసి అక్కడి వారంతా నవ్వుకున్నారు.. ఆ తర్వాత వైభవ్ నవ్వుతూ ఆ పిల్లలతో ఫొటో దిగి వారిని సంతోష పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, "పిల్లాడే పిల్లలతో ఆడుకుంటున్నాడు" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ ఒక సంచలనం. ప్రపంచ అత్యుత్తమ బౌలర్, ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి వైభవ్ తన పవర్ ఏంటో చూపించాడు. కేవలం కమిన్స్ మాత్రమే కాదు.. బుమ్రా, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రబాడ లాంటి స్టార్ బౌలర్ల బౌలింగ్‌లోనూ తొలి బంతినే బౌండరీకి పంపి తన 'ఫియర్‌లెస్' గేమ్‌ను ప్రదర్శించాడు. కాగా వైభవ్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన కమిన్స్, అతన్ని తన "ఫేవరెట్ ప్లేయర్" అని కొనియాడటం విశేషం.
దిగ్గజాల ప్రశంసలు:
వైభవ్ సూర్యవంశీ ప్రతిభను చూసి మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. మరో 25 ఏళ్ల పాటు వైభవ్ భారత క్రికెట్‌ను శాసిస్తాడు అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ను గల్లీ క్రికెట్ ఆడినంత ఈజీగా ఆడుతున్నాడు అంటూ ప్రశంసించారు. టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ ఏకంగా వైభవ్ ఆట తీరును సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. అయితే రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ 'బుడ్డోడు' భవిష్యత్తులో భారత జట్టుకు కూడా ప్రధాన బలమవుతాడని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Vaibhav Suryavanshi tricked young fans by asking 100rs per photo, then told them it’s a prank and clicked a photo with them. 😂❤️ pic.twitter.com/iwh9naGcK4
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 27, 2026

