సంగీతం, సాహిత్యం జీవితంలో భాగం అవ్వాలి

సంగీతం, సాహిత్యం జీవితంలో భాగం అవ్వాలి

గొప్ప భవిష్యత్ కు సమయపాలన అనేది చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. తాను చూసిన గొప్ప స్కూల్స్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటన్నారు. నేచర్ చాలా ముఖ్యమైనదని..నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమని తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తేనే మనకు భవిష్యత్ ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు.

శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా అలర్ట్ గా ఉంటామని వెంకయ్యనాయుడు అన్నారు. వ్యాయామానికి కుల, మతాలు లేవన్నారు. నేటి తరం జంక్ ఫుడ్ ను అవైడ్ చేయాలని సూచించారు. సంగీతం, సాహిత్యం మన రోజు వారి జీవితంలో భాగం అవ్వాలన్నారు . మాతృభాషపై పట్టు ఉండాలని తెలిపారు. బేసిక్ విద్యాభ్యాసం మాతృభాషలో ఉండాలని వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారు ఎవరూ ఇంగ్లీష్ మీడియంలో చదవలేదన్నారు . స్కిల్స్ పెంచుకోవాలి.. క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవాలని విద్యార్థులకు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.