
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లాలో రెండో రోజు ఆదివారం హోం ఓటింగ్ కొనసాగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల్లో హోం ఓటింగ్ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఆఫీసర్లు, స్టాప్ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటువేశారు. కామారెడ్డి ఆర్డీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన సెంటర్లో వారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.