ఇవాళ (మార్చి 19) గద్దర్ అవార్డ్స్ ప్రదానం..

ఇవాళ (మార్చి 19) గద్దర్ అవార్డ్స్ ప్రదానం..

కళాకారులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (టీజీఎఫ్ఏ) - 2026’ ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మాదాపూర్‌‌లోని హైటెక్స్ వేదికగా జరగనున్న ఈ వేడుకకు సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (టీజీఎఫ్ఏ) - 2026’ ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం మాదాపూర్‌‌‌‌లోని హైటెక్స్ వేదికగా జరగనున్న ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో జాతీయ, ప్రాంతీయ సినీ రంగాలకు చెందిన దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో వనజ ఉదయ్ డాన్స్ గ్రూప్ తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వనుంది. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, జానపద గాయని మంగ్లీ తమ గళంతో అలరించనున్నారు.