ఇయ్యాల (మార్చి 19న) 12 జిల్లాల డీసీసీ కమిటీల ప్రకటన : మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్

ఇయ్యాల (మార్చి 19న) 12 జిల్లాల డీసీసీ కమిటీల ప్రకటన : మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్
  • ఇంకా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ చీఫ్​ పదవులు: మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం 12 జిల్లాల కాంగ్రెస్ కమిటీలను ప్రకటించనున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్ తెలిపారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కమిటీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామన్నారు. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ చీఫ్ పదవుల భర్తీ మాత్రం ఏఐసీసీ నుంచి పరిశీలకులు వచ్చిన తర్వాతనే ఉంటుందని చెప్పారు.  

బుధవారం సీఎల్పీలో మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్​ మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డితో గురువారం సాయంత్రం లేదా శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నట్టు చెప్పారు. ఆయనను కాంగ్రెస్ కాపాడుకుంటుందని అన్నారు. తాను ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడే ప్రయత్నం చేశానని, తనకు జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అందుబాటులోకి రాలేదన్నారు. ఈ బడ్జెట్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోపే చీఫ్ విప్ పదవితోపాటు విప్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ వారిని అన్ని విషయాల్లో ఒప్పించగలిగే వ్యక్తికి చీఫ్ విప్ పదవి ఇస్తామని తెలిపారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఈ నెలాఖరులోగా నియమిస్తామని ప్రకటించారు. 

స్పోర్ట్స్ స్పెషల్ సెషన్

ఈ నెల 26 నుంచి 30 వరకు ఎమ్మెల్యేలకు ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్​ చెప్పారు. ప్రతిరోజూ 3 గంటలపాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. స్పోర్ట్స్ స్పెషల్ సెషన్ ఇది అని  చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పీసీసీ చీఫ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. 

మంత్రివర్గ విస్తరణ గురించి ఢిల్లీలో చర్చ జరగలేదని చెప్పారు. ఇటీవల హైకమాండ్ ప్రకటించిన రాష్ట్ర సమన్వయ కమిటీ..ప్రభుత్వ, పార్టీ కలిసి తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. డ్రగ్స్ విషయంలో మండలిలో తాను చేసిన చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని అన్నారు.