సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రిలో సింగరేణి కార్మికులతో  సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు పెంచేలా కృషి చేస్తామని చెప్పారు.  సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించిన మిగిలిన ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. బాల్క సుమన్, బోర్లకుంట వెంకటేష్ నేత ఐదేళ్లు ఎంపీగా ఉన్నా ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.పదవిలో ఉన్న లేకున్నా పెద్దపల్లి పార్లమెంట్లో విశాఖ, కాక ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 

తనపై ఈడి రైట్స్ చేసినా ఏం చేయలేకపోయారన్నారు వివేక్ వెంకటస్వామి.  కానీ కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి మిషన్ భగీరథ లో 45 వేల కోట్లు అవినీతి జరిగినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తుందన్నారు. మన  హక్కులను కాల రాయాలని చూస్తోంది..మన హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పారు.