ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు

 ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు

భారతజట్టుకు ఒకే రాష్ట్రం నుంచి ఎంపికై..జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్లేయర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్. వీరిద్దరు బెంగాల్ టైగర్ సౌరభ్ గంగూలీ సారథ్యంలో ఓ వెలుగు వెలిగారు. సుదీర్ఘ కాలం టీమిండియా తరపున ఆడారు. అంతేకాదు..28 ఏళ్ల తర్వాత భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీ రోల్ ప్లే చేశారు. 2007 టీ-20 వరల్డ్ కప్ను సాధించడంలోనూ ఇద్దరి కృషి మరవలేనిది. అయితే తన కెరియర్ గురించి..సహచర ఆటగాడు యువరాజ్ సింగ్ గురించి బజ్జీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

యువరాజ్ కెప్టెన్సీపై బజ్జీ చమత్కారం..
యువరాజ్ సింగ్ గొప్ప ప్లేయర్ అన్నాడు హర్భజన్ సింగ్. అతని వల్లే టీమిండియా 2011,2007 వరల్డ్ కప్లు సాధించిందని చెప్పాడు. అయితే యువరాజ్ సింగ్కు కెప్టెన్సీ దక్కకపోవడం లోటన్నాడు. ఒక వేళ యువరాజ్ తమ కెప్టెన్ అయి ఉంటే..తాము త్వరగానే నిద్రపోవాల్సి వచ్చేదని..త్వరగా లేవాల్సి వచ్చేదన్నాడు. అతను చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని..దీంతో తాము మరింత కష్టపడాల్సి వచ్చేదనని తెలిపాడు. యువరాజ్ కెప్టెన్ అయి ఉంటే మాత్రం..గొప్ప కెప్టెన్గా పేరు తెచ్చుకునేవాడని చెప్పుకొచ్చాడు. 

టాలెంట్తోనే వచ్చాం..
ప్రదర్శన ఆధారంగానే తామంతా జట్టులో చోటు దక్కించుకున్నామన్నాడు హర్భజన్ సింగ్. కెప్టెన్కు సన్నిహితంగా ఉంటే జట్టులో స్థానం దక్కుతుందనేది అబద్దమని చెప్పాడు. అప్పట్లో తాను, యువరాజ్, ఇతర ఆటగాళ్లు కెప్టెన్ వలనో..లేదా మరెవరో వలనో జట్టులో చోటు దక్కించుకోలేదని..దేశవాలీలో పరుగులు పారించి జట్టుకు ఎంపికయ్యామన్నాడు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనే జట్టులో అతని స్థానాన్ని నిర్ణయిస్తుందన్నాడు. 

మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్
సహచర ఆటగాడిగానే కాదు..యువరాజ్ ఫ్రెండ్గా అంటే మరింత ఇష్టమన్నాడు హర్భజన్ సింగ్. అతను మైదానంలో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో మైదానం బయట కూడా అంతే ఉత్సాహంగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం సంతోషంగా ఉందన్నాడు. 

హర్భజన్ సింగ్ 1998లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరియర్లో 103 టెస్టుల్లో 417వికెట్లు తీశాడు.  236 వన్డేల్లో  269వికెట్లు పడగొట్టాడు.
28 టీ-20ల్లో 25 వికెట్లు దక్కించుకున్నాడు.  హర్భజన్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అలాగే టెస్టుల్లో  రెండు సెంచరీల సాయంతో 2225 పరుగులు చేశాడు. వన్డేల్లో 1237 రన్స్ కొట్టాడు. అటు యువరాజ్ 2000 సంవత్సరంలో క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 304వన్డేల్లో 14సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో 8701పరుగులు చేశాడు. 40 టెస్టుల్లో 1900 రన్స్ కొట్టాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 58 టీ-20ల్లో 1177 పరుగులు చేశాడు. 8 అర్థసెంచరీలు నమోదు చేశాడు. ఇటు బౌలింగ్లో టెస్టుల్లో 9 వికెట్లు తీయగా..వన్డేల్లో 111 వికెట్లు దక్కించుకున్నాడు. అలాగే టీ-20ల్లో 28 వికెట్లు పడగొట్టాడు.