సాత్విక్‌‌‌‌‌‌‌‌–-చిరాగ్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్

సాత్విక్‌‌‌‌‌‌‌‌–-చిరాగ్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్
  •     నేటి నుంచి థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌: ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ ముంగిట ఇండియా డబుల్స్‌‌‌‌‌‌‌‌ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి  మంగళవారం మొదలయ్యే థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్ ఓపెన్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. థామస్ కప్‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ టోర్నీలో సత్తా చాటి ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ముందు టాప్ ఫామ్‌‌‌‌‌‌‌‌ అందుకోవాలని చూస్తున్నారు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో టాప్ సీడ్స్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్న ఇండియా జోడీ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో మలేసియాకు చెందిన నూర్ అజ్రిన్‌‌‌‌‌‌‌‌–టాన్ వీ కియోంగ్‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనుంది. 

సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో  హెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రణయ్‌‌‌‌‌‌‌‌.. ఇండోనేసియాకు చెందిన ఆంథోనీ గింటిగ్‌‌‌‌‌‌‌‌తో పోరు ఆరంభించనున్నాడు. లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌, పీవీ సింధు ఈ టోర్నీ నుంచి వైదొలగగా.. కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌, సతీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్ మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో పోటీలో ఉన్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయిన తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప మంచి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాలని కోరుకుంటున్నారు.