నిఖత్ జరీన్ ఎలోర్డా కప్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం

నిఖత్ జరీన్ ఎలోర్డా కప్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం

ఆస్టానా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌): వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌, ఇండియా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎలోర్డా కప్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన 52 కేజీ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో నిఖత్ తన ప్రత్యర్థి రఖైంబర్డి ఝన్‌‌‌‌‌‌‌‌సయా( కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌)పై పంచ్‌‌‌‌‌‌‌‌ల వర్షం కురిపించి 5-–0తో  ఘన విజయం సాధించింది. మీనాక్షి (48 కేజీ) 4-–1 తో కజకిస్థాన్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాస్సిమోవా రోక్సానాను ఓడించింది. 50 కేజీ  బౌట్‌‌‌‌‌‌‌‌లో అనామిక కూడా గెలిచింది. ఆమె పంచ్‌‌‌‌‌‌‌‌ల దెబ్బకు ప్రత్యర్థి జుమాబయేవా అరైలిమ్‌‌‌‌‌‌‌‌ తట్టుకోలేకపోవడంతో మొదటి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే పోటీని ఆపిన రిఫరీ అనామికను విజేతగా ప్రకటించారు.  అయితే, ఇష్మీత్ సింగ్ (75 కేజీ), సోనియా (54 కేజీ)  తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టారు.