ఎంపీలంత శ్రీమంతులం కావాలంటే..346 ఏండ్లు పట్టుద్ది!

ఎంపీలంత శ్రీమంతులం కావాలంటే..346 ఏండ్లు పట్టుద్ది!

న్యూఢిల్లీ: కొంచెం కష్టపడితే ఇబ్బంది లేకుండా బతకొచ్చు. బాగా కష్టపడితే లక్షలు సంపాదించొచ్చు. కానీ టైమ్​కి ట్యాక్స్​లు కట్టే సాధారణ పౌరులు.. మన ఎంపీలంత శ్రీమంతులు కావాలంటే మాత్రం 346 ఏండ్లు టైమ్​ పడుతుంది. ఇండియన్​ పార్లమెంట్​లో సంపన్నుల సంఖ్య ఆ రేంజ్​లో పెరిగిపోయింది మరి! తలసరి జాతీయ ఆదాయం రూ.1,25,397గా ఉన్నట్లు 2019 జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కన  సంపద విషయంలో సాధారణ ట్యాక్స్​ పేయర్​కి, ఎంపీలకు మధ్య తేడా 2014లో ​299 రెట్లుగా ఉంటే 2019నాటికి అది 345 రెట్లకు పెరిగింది. ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్​ ఫర్​ డెమోక్రటిక్​ రిఫామ్స్(ఏడీఆర్​) రిపోర్టు ఆధారంగా, తాజా ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లలోని వివరాల్ని, 2016–17 లో సాధారణ పౌరులు చెల్లించిన ట్యాక్స్​ లెక్కల్ని పోల్చితే సంపదలో ఇద్దరి మధ్య ఎంత గ్యాపుందో తెల్సిపోతుంది. 2014తో పోల్చుకుంటే 2019 నాటికి ఎంపీల ఆస్తులు   7.3 శాతం వార్షిక రేటుతో పెరిగాయి. యావరేజ్​ గ్రాస్​ ఇన్​కమ్​ రూ.4.9 లక్షల నుంచి రూ.6లక్షలకు పెరిగింది. 2014లో ఎంపీల యావరేజ్​ ఆస్తి  రూ.14.7 కోట్లుకాగా, 2019 నాటికి రూ.20.9కోట్లకు పెరిగింది. తిరిగి లోక్​సభకు ఎన్నికైన 225 సిట్టింగ్​ ఎంపీలతో పోల్చుకుంటే, కొత్తగా ఎన్నికైన ఎంపీల్లోనే శ్రీమంతులు ఎక్కువగా ఉన్నారు. 2009లో కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ ఆస్తి ఉన్నట్లు ప్రకటించిన ఎంపీల సంఖ్య 58కాగా, 2014 నాటికి 82, 2019లో 88కి పెరిగింది