పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమోనని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

పెళ్లి క్యాన్సిల్ అవుతుందేమోనని.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మే 3వ తేదీ బుధవారం ఉదయం ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. సురేఖ (28) అనే కానిస్టేబుల్ ఛాత్రినాక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది. ఆమె స్వస్థలం రంగారెడ్డి జిల్లా కందుకూరు. ఉద్యోగరిత్య తన సోదరితో అలియబాద్ ప్రాంతంలో ఓ ఇంటిలో అద్దెకు ఉంటుంది. తన సోదరి కూడా ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించారు. ఓ అబ్బాయితో రెండు రోజుల క్రితం సురేఖకు తమ ఇంటి వద్ద నిశ్చితార్థం కూడా చేశారు కుటుంబ సభ్యులు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు తిరిగి హైదరాబాద్ వచ్చింది. 

అయితే అబ్బాయితో వరుస కాలవక జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుందేమోనని సురేఖ ఆవేదనకు గురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. సమాచారం అందుకున్న శాలిబండ పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వ్యవహారంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీ కి తరలించారు.