ప్రాణాలు తీసిన ఆన్ లైన్ అప్పు: కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్ లో మెసేజ్

ప్రాణాలు తీసిన ఆన్ లైన్ అప్పు: కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్ లో మెసేజ్

సిద్దిపేట జిల్లా రాజగోపాలపేటలో విషాదం చోటు చేసుకుంది.  ఆన్ లైన్ అప్పు.. ఓ ఉద్యోగిని ప్రాణాలు తీసింది. గడువులోగా  లోన్ డబ్బులు కట్టలేదని.. ఉద్యోగిని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్ లో మెసేజ్  పంపింది ఆ లోన్ సంస్థ.  దీంతో మనస్థాపానికి గురైన  ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె మౌనిక  AEOగా రెండేళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. తండ్రి వ్యాపారాల్లో నష్టపోవడంతో ….. కుటుంబ అవసరాల కోసం మౌనిక ‘స్నాప్ ఇట్ లోన్ ’ యాప్ నుంచి రెండు నెలల కిందట 3 లక్షల అప్పు తీసుకుంది.

గడువులోగా లోన్ డబ్సులు చెల్లించలేదని…. మౌనిక ఫోన్ లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ డిఫాల్టర్ అంటూ వాట్సప్ మేసేజ్ లు పంపారు యాప్ నిర్వాహకులు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక.. ఈ నెల 14న ఇంట్లో  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మౌనిక సోదరుడు భరత్ ఫిర్యాదుతో  అసలు విషయం బయటకు వచ్చింది.

తండ్రి అవసరాల కోసం కూతురితో లోన్ తీయించాడు. లోన్ సంస్థ నుంచి మెసేజ్ లు వస్తుంటే తండ్రి రెస్పాన్స్ కాలేదు. 3 నెలల నుంచి తండ్రి, సవతి తల్లి కూడా పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు స్థానికులు.