దారుణం.. మహిళపై అత్యాచారం.. రక్తస్రావం తట్టుకోలేక మృతి

దారుణం.. మహిళపై అత్యాచారం.. రక్తస్రావం తట్టుకోలేక మృతి

హైదరాబాద్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. రక్తస్రావం తట్టుకోలేక మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ.ఆర్ పైప్ వర్క్ షాప్ సెల్లార్ లో అనుమానాస్పద రీతిలో ఓ మహిళ మృత దేహం లభ్యమైంది. స్థానికులు డెడ్ బాడీపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేయడంతో ఎక్కువగా రక్తస్రావం జరిగి మహిళ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మరింత దర్యప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.