IPL స్టార్ అభిషేక్ పొరెల్‌పై కేసు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి..!

IPL స్టార్ అభిషేక్ పొరెల్‌పై కేసు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి..!

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌ వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి పేరుతో మోసం చేశాడని అతడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని.. పెళ్లి చేసుకోవాలని అడిగితే తనపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడని హుగ్లీ జిల్లాలోని మొగ్రా పోలీస్ స్టేషన్‌లో యువతి కంప్లైంట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అభిషేక్ పొరెల్‎పై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అన్ని తప్పుడు ఆరోపణలు: అభిషేక్ పొరెల్

పెళ్లి పేరుతో యువతిని ఛీట్ చేసినట్లు తనపై వచ్చిన ఆరోపణలను అభిషేక్ పొరెల్ తీవ్రంగా ఖండించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవమని పేర్కొన్నాడు. కెరీర్‏లో తాను స్థిరపడుతుండటంతో కావాలనే కొందరు తనపై కుట్రలు చేస్తున్నారని అన్నాడు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు తనను సంప్రదించలేదని.. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపాడు. 

►ALSO READ | హిట్ మ్యాన్ ఖాతాలో మరో అరుదైన గౌరవం.. పద్మశ్రీ అవార్డ్ అందుకున్న రోహిత్ శర్మ

అభిషేక్ పొరెల్ కెరీర్:

వెస్ట్ బెంగాల్‎కు చెందిన అభిషేక్ పోరెల్ ఎడమచేతి వాటం టాప్-ఆర్డర్ బ్యాటర్, కీపర్. 2023 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లాస్ట్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లలో 108 పరుగులు చేశాడు. ఇక, 2021-22 సీజన్‌లో బెంగాల్ తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి.. 32 ఫస్ట్-క్లాస్, 23 లిస్ట్ A మ్యాచ్‌లు ఆడాడు. గతంలో ఇండియా 'ఎ' జట్టు తరుఫున యూకే, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు.