గుండె లయ వారోత్సవాలు

గుండె లయ వారోత్సవాలు

గుండె లయ...  వినడానికి ఎంత రిథమిక్ గా ఉంటుంది. కానీ.. గుండె.. లయ తప్పుతోంది. అవును పేరుకి గుప్పెడంత గుండే అయినా..  వయసుతో సంబంధం లేకుండా సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరినీ వణికిస్తోంది. అప్పటి వరకూ ఆరోగ్యంగానే కనిపిస్తారు.. సడన్ గా గుండె పోటుతో కుప్పకూలిపోతుండడంతో.. ప్రతి ఒక్కరిలో అలజడి మొదలవుతోంది. ఇంటర్నేషనల్ గుండె లయ వారోత్సాల సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 6 నుంచి 12 వరకూ గుండె లయ వారోత్సవాలు జరుగుతున్నాయి. హార్ట్ డిసీస్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. గుండె లయను బట్టి.. గుండె ఆరోగ్యాన్ని అంచానా వేయొచ్చంటోన్నారు కార్డియాలజిస్టులు. హార్ట్ రిథమిక్ లో ఉండే డిస్టబెన్స్ లను ముందే గుర్తిస్తే.. సమస్య రాదంటోన్నారు. అందుకే సిటీలో గుండె రిథమిక్ కు సంబంధించి.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే.. కనీసం 60 యేళ్లు దాటిన తర్వాత వచ్చేవి. ముసలివాళ్లే ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయేవారు. కానీ ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్ కు తగ్గట్లే.. జబ్బుల తీరు మారింది. వయసుతో సంబంధం లేకుండా... టీనేజ్ వారిని కూడా గుండె జబ్బులు బలితీసుకుంటున్నాయి. గుండె గుప్పెడంత సైజ్ కావొచ్చు కానీ... మొత్తం శరీరం, ప్రాణాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. హార్ట్ ఎటాక్ లతో కళ్ల మందు కదులుతున్న వారు కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకూ ఎంతో జోష్ గా పాటలు పాడిన కేకే.. గుండె నొప్పితో చనిపోయాడు. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా హార్ట్ స్ట్రోక్ తో కన్నుమూశాడు. ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు. ఇలా.. సెలబ్రెటీల న్యూస్ మాత్రమే బయటకి వస్తోన్నా... ఎంతోమంది సామన్యులు ఇలా గుండె పోటుతో చనిపోతున్నారు. గుండె లయపై పూర్తి అవగాహన ఉన్న చాలామంది డాక్టర్లు కూడా ఈ హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం ఆందోళన కలిగించే అంశం.

కొన్ని జబ్బులు మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. అందులో గుండె సంబంధిత సమస్యలు కూడా ఒకటి. ఆహారపు అలావాట్లు, వ్యాయామం లేకపోవడంతో.. ఎక్కువగా ఈ సమస్యలకు గురవుతున్నారు జనం. హెల్తీ ఫుడ్ ను పక్కన పెట్టి, జంక్ ఫుడ్ కు అలవాటు పడడం, మద్యపానం, సిగరెట్, డ్రగ్స్ వంటి అలవాట్లతో గుండెకు చేతులారా ముప్పు కొని తెచ్చుకుంటున్నారంటున్నారు డాక్టర్స్. రోజూ కొద్దిపాటి వ్యాయామం కూడా చేయకపోవడంతో.. గుండె అనారోగ్యం పాలవుతుందంటున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఎక్సర్ సైజ్ లు, వ్యాయామం చేస్తోన్నవారిలో కూడా హార్ట్ స్ట్రోక్ రావడం బాధాకరం. గుండె సాధారణంగా 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. గుండె ఈ వేగం కంటే తక్కువ కొట్టుకున్నా.. ఎక్కువగా కొట్టుకున్నా ప్రమాదమే . దీనివల్ల గుండె పంపింగ్ వీక్ అయ్యి.. ఫంక్షనింగ్ ఆగిపోతుంది. గుండె జబ్బు ఉన్నా లేకపోయినా.. కొన్ని సార్లు రిథమ్ లో తేడా వస్తుంది.  రక్త నాళాలలో బ్లాక్స్, పంపింగ్ వీక్ ఉండడం, వాల్వ్ లు ప్రాబ్లమ్స్ వంటి సమస్యలతో ఎక్కువగా గుండె దడ వస్తుందంటోన్నారు కార్డియాలజిస్ట్ లు. ఇక కొన్నిసార్లు థైరాయిడ్, సీఓపీడీ, నిద్రలేమి సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు ఉన్నా.. హార్ట్ స్ట్రోక్ వస్తుందని అంటున్నారు నిపుణులు. కొన్ని కేసుల్లో ఈసీజీ, టు డీ ఈకో.. వంటి టెస్ట్ లు చేసినా సమస్య తెలియడం లేదు. అలాంటి కేసుల్లో కొన్ని ప్రత్యేక టెస్టులు చేయాల్సి ఉంటుందంటున్నారు. మరోవైపు హార్ట్ లో పెయిన్ రాగానే వెంటనే హాస్పిటల్ కు వస్తే... 80 శాతం వరకు ప్రాణాలు కాపాడుకోవచ్చంటున్నారు.

రీసెంట్ గా చిన్న వయసులోనే ఎక్కువ మందికి గుండె పోటులు వస్తున్నాయి. వ్యాయామాలు మంచివే ఐనా.. మితి మీరిన వ్యాయామం కూడా కొన్నిసార్లు సమస్యకు కారణమవుతోంది. కండలు పెంచడం కోసం.. స్టెరాయిడ్స్ తీసుకోవడంతో హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు జంక్ ఫుడ్ తింటుండటంతో... బరువు  పెరుగుతున్నారు. గుండె జబ్బులకు వయస్సుతో సంబంధం లేకుండా పోయిందని చెప్తున్నారు కార్డియాలజిస్ట్ లు. పోస్ట్ కోవిడ్ లో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వచ్చిందని.. హెల్తీ ఫుడ్ పేరిట కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీస్కోవడంతో.. గుండెకు హాని చేస్తుందంటున్నారు. కొవ్వు పదార్ధాలు తీసుకోవడం వల్ల.. బరువు పెరుగుతున్నారు. హెల్తీ ఫుడ్ అంటే...కూరలు ఎక్కువగా తినడం, ప్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యవంతమైన అలవాట్లు ఉండాలంటున్నారు డాక్టర్లు. చిన్న వయసులో కూడా హార్ట్ ఎటాక్స్ వస్తుండడంతో జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. గుండె లయ వారోత్సవాల సందర్భంగా.. టెస్ట్ లు చేయించుకుని, లయను చెక్ చేస్కోవాలంటోన్నారు.