తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు

తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్ తగ్గినా.. బంగారం ధరలు మాత్రం తగ్గేదే లే అంటున్నాయి.  రోజురోజుకు బంగారం మరింత ప్రియం అవుతోంది.  ఇప్పటికే తులం బంగారం రూ.70వేలు దాటింది. దీంతో సామాన్య జనాలు బంగారం కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా.. బంగారం ధరలకు బ్రేక్ పడటం లేదు.  మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇండియన్ మార్కెట్ లో మే 10వ తేదీ శుక్రవారం  అక్షయ తృతీయ రోజు 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 850 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరిగింది.  తాజా పెరుగుదలతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం...

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67వేలు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల 90గా ఉంది. విజవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67వేల150గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల 240గా ఉంది. 
ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67వేలు,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73 వేల 90గాఉంది. 
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67వేల50 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73వేల150గా ఉంది. 
బెంగళూరులో 2 2క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67వేలు ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర  రూ.73వేల 90గా ఉంది
 

ఇక, బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండిపై రూ1300 పెరిగింది. దీంతో  హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలో కిలో వెండి ధర రూ.90 వేలకు చేరుకుంది.  ఢిల్లీ,  ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.86 వేల500గా ఉండగా.. బెంగళూరులో కిలో వెండి ధర రూ.84 వేల750గా ఉంది.