వాజపేయి బెడ్రూంలో ‘బాంబు’ ముచ్చట

వాజపేయి బెడ్రూంలో ‘బాంబు’ ముచ్చట
  • 1998 నాటి న్యూక్లియర్ టెస్ట్ సంగతిని వెల్లడించిన యశ్వంత్ సిన్హా
  • ఆంక్షలకు రెడీగా ఉండాలంటూ నాటి ఆర్థిక మంత్రికి ప్రధాని సూచన
  • నేడు సిన్హా ఆటోబయోగ్రఫీ ‘రిలెంట్ లెస్’ రిలీజ్

న్యూఢిల్లీ: ‘‘అది 1998 మే మొదటివారం. ప్రధాని అధికార నివాసం నుంచి మెసేజ్ వచ్చింది. అంతపొద్దున్నే పిలిచారంటే ఏదో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అయిఉంటుందనుకున్నా. లోపలికి సాదరంగా ఆహ్వానం పలికిన పీఎం వాజపేయి.. నన్ను నేరుగా బెడ్రూమ్ లో కి తీసుకెళ్లారు. చాలా కూల్ గా..‘యశ్వంత్ జి, ఇంకొద్ది రోజుల్లో మనం పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ చేయబోతున్నాం. ఇది చాలా సీక్రెట్ ఆపరేషన్. ఎందుకంటే ప్రపంచ శక్తులు దీన్ని మెచ్చవు. మన దేశంపై వాళ్లు ఆంక్షలు విధించొచ్చు. మన ఆర్థికరంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి రెడీగా ఉండండి’అని చెప్పారు. ఆయన మాటలకు నాలో ఒకేసారి భయం, గర్వం పొంగుకొచ్చాయి”అంటూ తన లైఫ్ లోని ఉత్కంఠభరిత సన్నివేశాన్ని ఆటోబయోగ్రఫీలో వివరించారు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా.

పాట్నాలో పుట్టి, ఐఏఎస్ గా కెరీర్ ఆరంభించి, బీహార్, కేంద్ర ప్రభుత్వాల్లో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి, 1984లో జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన, 1996లో బీజేపీలో చేరారు. కేంద్ర రాజకీయాల్లోకి మోడీ ఎంట్రీ తర్వాత క్రమక్రమంగా బీజేపీకి దూరమైన యశ్వంత్ సిన్హా.. ‘రిలెంట్ లెస్’ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. ఈ పుసక్తం సోమవారం విడుదల కానుంది.

దటీజ్ వాజపేయి!

1998, మే 1న పోఖ్రాన్ లో న్యూక్లియర్ టెస్ట్ విజయవంతంగా ముగిసింది. పీఎం వాజపేయి ఊహించినట్లే అమెరికాతోపాటు పెద్ద దేశాలన్నీ ఇండియాపై రకరకాల ఆంక్షలు విధించాయి. వాటికి తలొగ్గబోమని పీఎం ఖరాఖండిగా చెప్పారు. ఇండియా కంటే తామే ఎక్కువ నష్టపోతున్నామని గుర్తించిన పెద్ద దేశాలు.. కొద్ది రోజులకే ఆంక్షలు ఎత్తేశాయని యశ్వంత్ సిన్హా గుర్తు చేస్తారు. ‘‘2003లో ఇరాక్పై యుద్ధానికి వెళ్లాలని అమెరికా ప్రెసిడెంట్ జార్జి బుష్ డిసైడయ్యారు. అమెరికాకు మద్దతుగా ఇండియన్ ఆర్మీని పంపాలంటూ వాజపేయిని బుష్ రిక్వెస్ట్ చేశారు. ఆ ప్రపోజల్కు ఒప్పుకుంటే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని బీజేపీ సీనియర్లైన ఎల్కే అద్వానీ, జశ్వంత్ సింగ్ తదితరులు భావించారు. వాజపేయికి మాత్రం అలా చేయడం ఇష్టంలేకుండె. ఈలోపే అప్పటి ప్రతిపక్ష నేత సోనియా గాంధీ.. ఇరాక్కు మన ఆర్మీని పంపొద్దంటూ లేఖరాయడంతో పీఎం చర్చలకు ఆహ్వానించారు. ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, నట్వర్లాల్ తదితర సీనియర్లను వెంటేసుకుని సోనియా గాంధీ.. పీఎంను కలిశారు. వాళ్లు చెప్పింది ఓపికగా విన్న ఆయన, ఎన్డీఏ పార్టీల అభిప్రాయాన్ని కూడా అడిగితెల్సుకున్నారు. అందరినీ ఒప్పించాకే  బుష్ రిక్వెస్ట్కి నో చెబుతూ వాజపేయి ప్రకటన చేశారు”అని యశ్వంత్ సిన్హా వివరించారు.

పీఎంజీఎస్ వై ఐడియా నాదే

రవాణా రంగంలో పెనుమార్పులకు కారణమైన నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్(ఎన్హెచ్డీపీ), ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY) పూర్తిగా తన ఐడియాలేనని యశ్వంత్ సిన్హా చెప్పారు.