రైతులు వ్యవసాయం మానేస్తే పరిస్థితి ఏంటి?

రైతులు వ్యవసాయం మానేస్తే పరిస్థితి ఏంటి?

న్యూఢిల్లీ: రైతులు వ్యవసాయం మానేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిసోడియా.. బీజేపీ లీడర్లపై అటాక్ చేశారు. రైతుల నిరసనలకు మొదట్నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుగా ఉంటోందన్నారు. అన్నదాతలు ఒక్క సీజన్‌‌లో సాగు చేయడం మానేసినా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుందన్నారు. ‘బీజేపీ వాదులారా.. మీరు రైతులకు ఇంటర్‌‌నెట్ అందుబాటులో లేకుండా చేస్తున్నారు. నీళ్ల సరఫరా, విద్యుత్‌‌ సేవలతోపాటు రోడ్లనూ బంద్ చేస్తున్నారు. ఒకవేళ రైతులు ఒక సీజన్‌‌లో వ్యవసాయం చేయడం మానేస్తే మీరు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. మీ నాయకులకు అర్థమయ్యేలా చెప్పండి. అహంకారంతో కడుపు నిండదు’ అని మనీశ్ ట్వీట్ చేశారు.