ఫ్రెండ్ బర్త్ డే: ఎడారిలో వెళ్లి మరీ విష్ చేసిన అమితాబ్

ఫ్రెండ్ బర్త్ డే: ఎడారిలో వెళ్లి మరీ విష్ చేసిన అమితాబ్

ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు ప్రేమ్ చోప్రా ఇవాళ్టితో 86వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా హిందీ సినీ ప్రముఖులందరూ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ప్రేమ్ చోప్రాకు శుభాకాంక్షలు తెలిపారు. అమితాబ్, ప్రేమ్ చోప్రాకు మధ్య మంచి అనుబంధం ఉంది. 300కు పైగా సినిమాల్లో నటించిన ప్రేమ్ చోప్రా.. పలు అమితాబ్ సినిమాల్లోనూ తన నటనతో అలరించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అందుకే ప్రేమ్ చోప్రా ప్రతి బర్త్ డేకు అమితాబ్ విషెస్ చెబుతూ ఉంటారు. 

అమితాబ్‌తో తన స్నేహం, గత స్మృతులను ప్రేమ్ చోప్రా పంచుకున్నారు. ‘ఒక ఏడాది నా బర్త్ డే సమయంలో అమితాబ్ ఎక్కడో ఎడారిలో మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయినా సరే.. ఆ ఎడారిలో నా కోసం కొంత దూరం ప్రయాణించి దగ్గర్లోని ఫోన్ బూత్‌ నుంచి ఫోన్ చేసి విష్ చేశారు. అ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను’ అని ప్రేమ్ చోప్రా చెప్పారు. నటన కంటే వ్యక్తిత్వమే అమితాబ్‌ను ఈస్థాయికి చేర్చిందని.. ఆయన తన పనేంటో తాను చూసుకుంటూ ముందుకెళ్లే వ్యక్తి అని ప్రశంసించారు. ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించకుండా ఉండటమే బిగ్ బీ సక్సెస్‌కు కారణమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని..కేటీఆర్ స్పందన

‘మా’ ఎలక్షన్స్: ప్యానెల్‌ ప్రకటించిన మంచు విష్ణు

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా?

సీఎం గారూ.. నలుగురికి చార్టెడ్ ఫ్లయిట్ అవసరమా?