‘మా’ ఎలక్షన్స్: ప్యానెల్‌ ప్రకటించిన మంచు విష్ణు

V6 Velugu Posted on Sep 23, 2021

హైదరాబాద్: గత కొన్ని నెలల నుంచి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు పోటాపోటీకి దిగడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌ను ప్రకటించి ప్రచారంలో జోరు పెంచారు. తాజాగా మంచు విష్ణు కూడా తన ప్యానెల్‌లో ఎవరెవరు ఏయే పదవులు కోసం పోటీలోకి దిగబోతున్నారో వెల్లడించారు. ‘మా’ కోసం మనందరం పేరుతో ఆయన తన ప్యానెల్‌ సభ్యుల లిస్టును ప్రకటించారు. 

మంచు విష్ణు ప్యానెల్‌లో మొత్తంగా ఎనిమిది మంది పదవుల కోసం పోటీపడనున్నారు. అధ్యక్ష పదవికి మంచు విష్ణు, జనరల్ సెక్రటరీ పోస్టుకు సీనియర్ నటుడు రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌కు బాబు మోహన్, వైస్ ప్రెసిడెంట్‌కు మాదాల రవి, పృథ్వీరాజ్ బాలిరెడ్డి, కోశాధికారికి శివబాలాజీ, జాయింట్ సెక్రటరీ పోస్టుకు కరాటే కళ్యాణి, గౌతమ్ రాజులు బరిలోకి దిగనున్నారు. వీరితోపాటు మరో 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ల పదవుల కోసం పోటీ చేయనున్నారు. ఈ వివరాలను విష్ణు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కాగా, అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం: 

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని..కేటీఆర్ స్పందన

సమస్యలను పరిష్కరించకపోతే అంతర్యుద్ధం తప్పదు

17 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్న జూ.ఎన్టీఆర్

Tagged Prakash Raj, Manchu Vishnu, Maa Elections, Jeevita Rajsekhar, Manchu Vishnu Panel

Latest Videos

Subscribe Now

More News