కేరళం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?

కేరళం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..?

తిరువనంతపురం: కేరళం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. 2026, ఏప్రిల్ 9న కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‎ను ఆదివారం (మార్చి 15) కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విడుదల చేశారు. కేరళంలోని మొత్తం 140 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

2026, మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నికల సంసిద్ధతను సమీక్షించడం, ఓటర్ల జాబితాలను ఖరారు చేయడం, రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను అంచనా వేయడం వంటి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేరళంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. 

కేరళ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్:

1. మార్చి 16న గెజిట్ నోటిఫికేషన్ విడుదల
2. మార్చి 16 నుంచి నామినేషన్ల స్వీకరణ
3. మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరణ
4. మార్చి 24న నామినేషన్ల పరిశీలన
5. మార్చి 26 వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం
6. ఏప్రిల్ 9న పోలింగ్
7. మే 4న కౌంటింగ్, ఫలితాల విడుదల