వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..

చాలామంది విద్యార్థులు చదువుకునే వయసులోనే పనిచేస్తుంటారు. ఓ పక్క పనిచేస్తూ.. మరో పక్క స్కూల్‎కు వెళ్తుంటారు. ఆ విధంగా తల్లిదండ్రులకు ఆర్థికంగా చేయూతనందిస్తుంటారు. అంతేకాకుండా.. తమకు కావలసిన వాటి కోసం ఎవరి మీదా ఆధారపడరు. ఈ విధంగా చేయడం వల్ల అటువంటి పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. తాజాగా అటువంటి సంఘటనొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లుకొడుతోంది.

జగిత్యాలకు చెందిన శ్రీ ప్రకాశ్ అనే ఒక విద్యార్థి పేపర్ వేస్తూ రోడ్డుపై వెళ్తుండగా.. బైకు మీద వెళ్తున్న ఒక వ్యక్తి అతనితో మాట్లాడాడు. చదవుకునే వయసులో పేపర్ వేస్తున్నావ్ ఎందుకు అంటే.. చదువు కుంటే పేపర్ వేయొద్దా అని సమాధానమిస్తూ.. తప్పు కానప్పుడు ఏ పని చేస్తే ఏముంది అని చెప్పకనే చెప్పాడు. అంతేకాకుండా.. చదువుకుంటూ పేపర్ వేస్తే తప్పేముంది అని ప్రశ్నించాడు. ఈ వయసులో కష్టపడితే.. పెద్దయిన తర్వాత ఏ కష్టమొచ్చినా ఈజీగా ఎదుర్కొవచ్చని ఆత్మవిశ్వాసాన్ని చూపించాడు. ఈ వీడియో చూస్తే.. దేన్నైనా కష్టపడి ఆత్మవిశ్వాసంతో సాధించొచ్చని అర్థమవుతోంది. 

కాగా.. ఈ వీడియో బుధవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి కేటీఆర్ దృష్టికి కూడా వచ్చింది. ఆ అబ్బాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటపడిన ఆయన.. ఆ వీడియోను తన ట్విట్టర్, ఫేస్‎బుక్ అకౌంట్లలో పోస్ట్ చేశాడు.

 

For More News..

ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని.. కేటీఆర్ స్పందన

పరువు తీస్తున్నాడని మామని కొట్టి చంపిండు