గల్ఫ్ అల్లకల్లోలం.. బహ్రెయిన్పై75 మిస్సైల్స్, 123 డ్రోన్స్తో ఇరాన్ అటాక్..

గల్ఫ్ అల్లకల్లోలం.. బహ్రెయిన్పై75 మిస్సైల్స్, 123 డ్రోన్స్తో ఇరాన్ అటాక్..

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలుతున్నాయో తెలియని పరిస్థితి. మిస్సైళ్ల ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలుతుంటే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇరాన్ ను అణచేందుకు అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలను లెక్కచేయకుండా ఇరాన్ తిరగబడుతోంది. లేటెస్టుగా బహ్రెయిన్ పై ఇరాన్ భీకర దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడికి దిగింది.

ఇరాన్ దాడితోబహ్రెయిన్ డిఫెన్స్  చేతులెత్తేసింది. మొదట పోరాడినట్లు కనిపించినా తర్వాత ఇరాన్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై 75 మిస్సైల్స్, 123 డ్రోన్స్ తో అటాక్ చేసింది ఇరాన్. దీంతో పెట్రోల్ కంపెనీ రిఫైనరీ మంటల్లో చిక్కుకుపోయింది.

మరోవైపు అమెరికా దాడులను కొనసాగిస్తూనే ఉంది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ పై B -2 బాంబర్లతో అమెరికా దాడులకు దిగింది. బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లే లక్ష్యంగా దాడులు చేస్తోంది యూఎస్. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేయడంతో.. ఇరాన్ భారీ నౌక మంటల్లో  చిక్కుకుంది.