సికింద్రాబాద్ లో ఇవాళ్టి(మార్చి 6)నుంచి ట్రాఫిక్ మళ్లింపులు

సికింద్రాబాద్ లో ఇవాళ్టి(మార్చి 6)నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
  • సివరేజ్ పైప్‌‌లైన్ పనులే కారణం

మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్​లోని భారత్ పెట్రోలియం బంక్ నుంచి రైల్వే బ్రిడ్జ్ అండర్​పాస్ వరకు వాటర్ బోర్డు సుమారు 419 మీటర్ల మేర సివరేజ్ పైప్​లైన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. పంజాగుట్ట, బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలను సెంట్ జాన్స్ రోటరీ వద్ద సంగీత్ జంక్షన్, అపోలో ఆసుపత్రి లేన్, చిలకలగూడ సర్కిల్, అలుగడ్డబావి, మెట్టుగూడ మార్గాల్లో మళ్లిస్తారు. ఏవోసీ వైపు నుంచి వచ్చే వాహనాలు షెనోయ్ నర్సింగ్ హోమ్ జంక్షన్ వద్ద అడ్డగుట్ట, తుకారాం గేట్, లాల్లాగూడ మీదుగా మెట్టుగూడ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

క్లాక్ టవర్, ఎస్డీ రోడ్ ప్రాంతాల నుండిచివచ్చే వాహనాలను సంగీత్ జంక్షన్ వద్ద అపోలో ఆసుపత్రి లైన్, చిలకలగూడ సర్కిల్ వైపు మళ్లిస్తారు. రెజిమెంటల్ బజార్, డీ-మార్ట్ నుంచి వచ్చే వాహనాలు కూడా అపోలో ఆసుపత్రి లైన్, అలుగడ్డబావి మీదుగా వెళ్లాలని సూచించారు. సంగీత్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను తపస్య డిగ్రీ కాలేజీ సమీపంలో తుకారాం గేట్ మెయిన్ రోడ్, లాలాగూడ వైపు మళ్లించారు. కొన్ని వాహనాలు ఎన్​సీఎల్ యూ-టర్న్ వద్ద వెనక్కి తిరిగి అపోలో ఆసుపత్రి లేన్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.