పరీక్ష బాగా రాయలేదని ఇంటర్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్

పరీక్ష బాగా రాయలేదని ఇంటర్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్

దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : ఇంటర్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌ బాగా రాయలేదని సెకండ్‌‌‌‌ ఇయర్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ సూసైడ్‌‌‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌‌‌‌లోని సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ పీఎస్‌‌‌‌ పరిధిలోని లింగోజిగూడలో గురువారం జరిగింది. సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... లింగోజిగూడలోని మణిపూర్‌‌‌‌ కాలనీకి చెందిన గౌతమ్‌‌‌‌ శర్మ (17) ఇంటర్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతున్నాడు.

గురువారం మ్యాథ్స్‌‌‌‌ 2 ఎగ్జామ్‌‌‌‌కు హాజరుకాగా.. బాగా రాయకపోవడంతో ఫెయిల్‌‌‌‌ అవుతానని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి.. గౌతమ్‌‌‌‌శర్మను స్థానికంగా హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.