పరువు తీస్తున్నాడని మామని కొట్టి చంపిండు

V6 Velugu Posted on Sep 23, 2021

కల్వకుర్తి, వెలుగు: ఊర్లోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని పరువు తీస్తున్నాడనే కోపంలో సొంత మామను అల్లుడే కొట్టి చంపాడు. కల్వకుర్తి సీఐ సైదులు వివరాల ప్రకారం.. నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన పెరుమాండ్ల సత్యనారాయణ(48), శాంతమ్మ భార్యాభర్తలు. వీరి కూతురు రజితను తలకొండపల్లి మండలం చుక్కాపూర్ కు చెందిన కాలూరు బాలకృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు. ఏడాదిగా కూతురు, అల్లుడు మార్చాలలోనే ఉంటున్నారు. కాగా సత్యనారాయణ ఊర్లోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తరచూ ఆమెకు డబ్బు, బంగారం ఇస్తున్నాడని అల్లుడు బాలకృష్ణకు తెలిసింది. ఈ నెల 19న సత్యనారాయణ సదరు మహిళతో పొలం వద్ద ఉన్నాడని తెలుసుకున్న బాలకృష్ణ అక్కడికి వెళ్లి మామను కొట్టాడు. కర్చీఫ్​ను మెడకు బిగించి చంపేశాడు. శాంతమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో అల్లుడే హత్య చేసినట్లు తేలింది. బాలకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Tagged death, woman, extramarital affair, uncle,

Latest Videos

Subscribe Now

More News